దర్శకుడు శేఖర్ కమ్ములకు పితృ వియోగం

Advertisement

టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట్లో విషాదమైన సంఘటన చోటుచేసుకుంది. ఆయన తండ్రి శేషయ్య కమ్ముల(89) కన్నుమూశారు. ఈ రోజు ఉదయం 6 గంటలకు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న శేషయ్య కమ్ముల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అలాగే ఈ రోజు సాయంత్రం సికింద్రాబాద్ లోని బన్సీలాల్ పేట స్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అలాగే అతని మరణ వార్త విన్న సినీ ప్రముఖులు తీవ్ర ద్రిగ్బంతి వ్యక్తం చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here