Sehwag: ప‌వ‌న్ స్టైల్‌లో నాక్కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది అంటున్న సెహ్వాగ్

Sehwag: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌కి పెద్ద బూస్ట‌ప్ ఇచ్చిన చిత్రం గబ్బర్ సింగ్. 2012 లో విడుదలైన ఈ సినిమాని బండ్ల గణేష్ శ్రీ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకం పై నిర్మించారు. ప్రముఖ హిందీ నటుడు సల్మాన్ ఖాన్ సంచలనాత్మక విజయం సాధించిన “దబాంగ్” సినిమాకి రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా నటించగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు.

Sehwag Tells Pawan Kalyans Dialogue in His Manner
Sehwag Tells Pawan Kalyans Dialogue in His Manner

2012 మే 11న విడుదలైన ఈ సినిమా విమర్శకుల మరియూ ప్రేక్షకుల ఆదరణ పొందడమే కాక 63 కోట్ల రూపాయల వసూళ్ళు సాధించి తెలుగు సినిమా స్థాయిని పెంచింది. ఇందులోని కొన్ని మాటలు తూటాల్లా పేలాయి.. అరె కోటీ ఇంకో టీ……నాక్కొంచెం తిక్కుంది. కానీ దానికో లెక్కుంది…. నా తిక్కేంటో చూపిస్తా… అందరి లెక్కలు తేలుస్తా…….నాకు నేనే పోటీ! నాతో నాకే పోటీ!.. అరె వో గబ్బర్ సింగ్ కే ఫౌజియో!… నేను ట్రెండ్ ఫాలో అవను, సెట్ చేస్తా…అబ్బబ్బబ్బబ్బా… ఏం సెప్తిరీ ఏం సెప్తిరీ…ఇలాంటి మాటలు పవర్ స్టార్ అభిమానులను ఉర్రుతలుగించాయి.


అయితే ప‌వ‌న్‌కి గ‌బ్బర్ సింగ్ సినిమాలోని .నాక్కొంచెం తిక్కుంది. కానీ దానికో లెక్కుంది అనే మాట‌లు రియ‌ల్ లైఫ్‌లోను స‌రిపోతాయి. చాలా మంది కూడా ప‌లు సంద‌ర్భాల‌లో ఈ డైలాగ్ వాడుతూ ప‌వ‌న్ స్టైల్‌లో మేన‌రిజం ప్ర‌ద‌ర్శిస్తుంటారు.తాజాగా టీమిండియా డాషింగ్ ఓపెన‌ర్ వీరేంద్క సెహ్వ‌గ్ ఇదే డైలాగ్‌ని అచ్చం ప‌వ‌న్ స్టైల్‌లో అంటూ ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇచ్చాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో ట్రెండింగ్‌లో ఉంది.


సెహ్వాగ్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ అన్న సంగ‌తి తెలిసిందే. సినిమా, రాజకీయాలతో పాటు ప‌లు విష‌యాల‌పై త‌న‌దైన శైలిలో కామెంట్స్ చేస్తూ నెటిజ‌న్స్‌ని అల‌రిస్తుంటారు సెహ్వాగ్. తాజాగా ఆయ‌న ప‌వ‌న్ స్టైల్ లో వీడియో చేయ‌గా, ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డమే కాక ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంటుంది.