షాకింగ్‌… వాయిదా ప‌డ్డ సీటీమార్.. త్వ‌ర‌లో అఫీషియ‌ల్ రిలీజ్ డేట్ ప్ర‌క‌ట‌న‌

క‌రోనా వ‌ల‌న దాదాపు తొమ్మిది నెల‌లు సినీ ప‌రిశ్ర‌మ పూర్తిగా స్తంభించింది. ఇక ఇప్పుడు సెకండ్ వేవ్ మొద‌లు కావ‌డంతో మ‌ళ్లీ థియేట‌ర్స్‌కు వెళ్లే వారి సంఖ్య క్ర‌మ‌క్ర‌మేపి త‌గ్గుతుంది. దీంతో ఇప్ప‌టికే రిలీజ్ డేట్ ప్ర‌క‌టించిన కొన్ని సినిమాలు వాటి రిలీజ్‌ల‌ని వాయిదా వేసుకుంటున్నాయి. తాజాగా గోపిచంద్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన సీటీమార్ చిత్రం వాయిదా ప‌డింది. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా తెలియ‌జేస్తూ త్వ‌ర‌లో అఫీషియ‌ల్ రిలీజ్ డేట్ ప్ర‌క‌టిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో గోపిచంద్ హీరోగా వస్తోన్న స్పోర్ట్స్ యాక్షన్ సీటీమార్. ఈ సినిమా సమ్మర్ కానుకగా ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. క‌రోనా వ‌ల్ల‌నో లేదంటే ఇత‌ర కార‌ణాలో తెలియ‌దు కాని ఈ చిత్రం వాయిదా ప‌డింది. ‘లౌక్యం’ తర్వాత సరైన సక్సెస్ లేని గోపిచంద్.. ఈ చిత్రంపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఇందులో గోపిచంద్ ఆంధ్రప్రదేశ్ కబడ్డీ కోచ్‌గా.. తమన్నా తెలంగాణ కబడ్డీ కోచ్ పాత్రలో నటిస్తోంది. మరో హీరోయిన్‌గా దిగాంగన నటిస్తోంది. భూమిక మరో ముఖ్య పాత్రలో కనిపించనుంది. ప్ర‌స్తుతం గోపిచంద్ మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ అనే సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే.

Advertisement