seethakka : షాకింగ్ : జైలుకి వెళ్లబోతోన్న ఎమ్మెల్యే సీతక్క ?

seethakka: ములుగు ఎమ్మెల్యే సీతక్క ఒక కేసు విషయం లో కోర్టు విచారణకు పదే పదే డుమ్మా కొడుతున్నారు అని ఆమెకు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఫిబ్రవరి 9వ తేదీలోపు సీతక్క పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ అమలు చేయాలని ములుగు పోలీసులను కోర్టు ఆదేశించింది. దీంతో కోర్టు విచారణకు హాజరు కాకపోవడం తో సీతక్క కి ఒక్కసారిగా షాక్ తగిలినట్లయింది. అరెస్టు వారంట్ జారీ కావడంతో ఆమె మళ్ళీ జైలు కు వెళ్ళబోతున్నారా అని చర్చలు కూడా ఊపందుకున్నాయి.

గత ఏడాది కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క రైతుల సమస్యల పై నిరసనలు చేస్తూ సీఎం కార్యాలయం ముట్టడించినప్పుడు.. పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నేతలు గోదావరి జల దీక్ష చేస్తున్న సమయంలో ఎమ్మెల్యే సీతక్క ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన విషయం కూడా తెలిసింది. ఐతే లాక్ డౌన్ టైమ్ లో ఆమె ఆదివాసులకు నిత్యావసర సరుకులు అందించడానికి కొండలు, గుట్టలు కాలినడకన దాటి మిగతా రాజకీయ నాయకులు అందరికీ స్ఫూర్తిదాయకం అయ్యారు. నక్సలైట్ ఉద్యమంలో పాల్గొని రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసిన ఎమ్మెల్యే సీతక్క చాలా దూకుడుగా వ్యవహరిస్తుంటారు.

ఇకపోతే హెరిటేజ్ సంస్థ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసు లో విచారణలో భాగంగా ఏపీ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు కోర్టు కు హాజరయ్యారు. తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చిరుమర్తి లింగయ్య, పొన్నం ప్రభాకర్, కంచర్ల భూపాల్ రెడ్డి, పి.చంద్రశేఖర్, కాశీపేట లింగయ్య, జాజల సురేందర్‌లు కూడా కోర్టుకు హాజరయ్యారు. ఇక వేర్వేరు కేసుల్లో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి లకు కోర్టు సమన్లు పంపింది. ఈ సందర్భంగానే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు పై 3 కేసులను ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు కొట్టివేసింది.

Advertisement