సికింద్రాబాద్ రైల్ నిలయంలో కరోనా కలకలం, 40 మందికి పాజిటివ్

Advertisement

కరోనా ఎవ్వరిని వదలడం లేదు. ఇప్పటికే చాలా మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఇక ఇది ఇలా ఉంటె తాజాగా సికింద్రాబాద్ రైల్ నిలయంలో సుమారు 40 మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దీనితో రెండు రోజుల పాటు ఆ కార్యాలయాన్ని మూసివేసి అధికారులు పూర్తిగా శానిటైజ్ చేశారు. అయితే రైల్ నిలయం కార్యాలయం ఏడు అంతస్తులు ఉంటుంది. ఇక ఈ కార్యాలయంలో సుమారు 1800 మంది వరకూ ఉద్యోగులు పని చేస్తుంటారు.

ఈ కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే కొంతమంది సిబ్బంది ఒక రోజు, మిగిలిన సిబ్బంది ఆ తరువాత రోజు విధులు నిర్వహిస్తున్నారు. అయితే సుమారు 90 శాతం మందికి మూడు రోజుల పాటు మొబైల్ టెస్టింగ్ వ్యాన్ల ద్వారా కరోనా టెస్టులు నిర్వహించారు. ఇక ఈ టెస్టుల్లో ఏకంగా 40 మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయినట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here