SECUNDERABAD: సికింద్రాబాద్‌లో అగ్ని ప్ర‌మాదం.. మంట‌ల్లో కాలిపోయిన 11 మంది కార్మికులు

NQ Staff - March 23, 2022 / 08:34 AM IST

SECUNDERABAD: సికింద్రాబాద్‌లో అగ్ని ప్ర‌మాదం.. మంట‌ల్లో కాలిపోయిన 11 మంది కార్మికులు

SECUNDERABAD: సికింద్రాబాద్‌లో అతి పెద్ద అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. బోయగూడలో ఉన్న టింబర్ డిపోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున జరిగిన ఘటనలో ఐదుగురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. ఆ సమయంలో గోడౌన్‌లో 11మంది ఉండగా ఒకరి ఆచూకీ మాత్రమే లభ్యమైందని అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పారు.

SECUNDERABAD FIRE ACCIDENT 11 MIGRANT WORKERS DIED IN TIMBER AND SCRAP GODOWN

SECUNDERABAD FIRE ACCIDENT 11 MIGRANT WORKERS DIED IN TIMBER AND SCRAP GODOWN


టింబర్ డిపోలో చెక్కలు మంటలు అంటుకుని తగలబడటంతో కార్మికులు అదుపుచేయలేకపోయారు. క్రమంగా అవి అక్కడే ఉన్న దుంగలు, కట్టెలకు మొత్తానికి విస్తరించినట్లు పోలీసులు తెలిపారు. డిపో మొత్తానికి వ్యాపించడంతో పెద్ద ఎత్తున్న అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.

సమాచారం అదుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఐదు ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపుచేశారు. మంటల ధాటికి గోడౌన్‌ పైకప్పు కూలిపోయింది. మంటలను అదుపుచేయడాని ఫైర్‌ సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. 8 ఫైర్ ఇంజిన్ల సిబ్బంది గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పోలీసులు తెలిపారు.

జనావాసాలకు సమీపంలో మంటలు ఒక్కసారిగా తీవ్రంగా వ్యాపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. చుట్టుపక్కల ప్రజలు భయంతో పరుగులు తీశారు. కాగా.. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

ప్ర‌మాదంలో కొందరు సజీవదహనమవగా, మరికొందరు ఊపిరాడక చనిపోయారన్నారు. మరొకరు క్షేమంగా బయటపడ్డారని వెల్లడించారు. ప్రమాద సమయంలో టింబర్‌ డిపోలో 12 మంది ఉన్నారని చెప్పారు. మృతులంతా బీహార్‌కు చెందిన వలస కార్మికులని తెలిపారు. మృతులను బిట్టు, సికిందర్‌, దామోదర్‌, సత్యేందర్‌, చింటు, దినేష్‌, రాజేష్‌, రాజు, దీపక్‌, పంకజ్‌గా గుర్తించారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us