Scientists : కోడి ముందా.. గుడ్డు ముందా ప్రశ్నకు సమాధానం దొరికేసింది..!
NQ Staff - June 18, 2023 / 09:48 AM IST

Scientists : గత కొన్నేళ్లుగా యావత్ ప్రపంచాన్ని ఓ ప్రశ్న వెంటాడుతోంది. అదేంటంటే కోడి ముందా లేకపోతే గుడ్డు ముందా అనేది. ఈ ప్రశ్నకు ఇప్పటి వరకు చాలా రకాల సమాధానాలు వినిపించినా.. అవేమీ వాస్తవం కాదు. కేవలం రూమర్లు మాత్రమే. దాంతో ఈ ప్రశ్నకు సరైన సమాధానం కోసం ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నారు.
ఇదిలా ఉండగా తాజాగా ఈ ప్రశ్నకు సమాధానం దొరికేసింది. సైంటిస్టులు చాలా కాలంగా పరిశోధనలు చేసి ఈ ప్రశ్నకు సమాధానాన్ని కనిపెట్టేశారు. ఇప్పుడున్న పక్షులు, సరీసృపాలు, క్షీరదాలు.. ఒకప్పుడు గుడ్లను పెట్టేవి కావు. నేరుగా పిల్లలకు జన్మనిచ్చేవి. అలాగే కోళ్లు కూడా అప్పట్లో నేరుగా పిల్లల్ని కనేవంట.
ఇదే విషయాన్ని తాజాగా తెలిపారు సైంటిస్టులు. మారుతున్న కాలానికి అనుగుణంగా గుడ్లు పెట్టడం స్టార్ట్ చేసినట్టు వివరించారు. దాంతో ఇన్నాళ్ల ఉత్కంఠకు ఇప్పుడు తెర పడినట్టు అయింది. ప్రస్తుతం అన్ని రకాల పక్షులు గుడ్లు పెడుతున్నాయి. ఆ గుడ్ల నుంచే పక్షులు వస్తున్నాయి.