సెప్టెంబర్ 1 నుండి స్కూళ్ళు ప్రారంభం

Advertisement

కరోనా దెబ్బకు స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు అన్ని కూడా మూతపడ్డాయి. అయితే ఇప్పటి వరకు మూతపడ్డ విద్యా సంస్థలను ప్రారంభించాలని కేంద్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. దేశంలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 14 వరకు దశల వారీగా పాఠశాలలు తిరిగి ప్రారంభించేలా కేంద్ర ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఈ విషయంపై కేంద్రం మార్గదర్శకాలు కూడా జరీ చేసింది. అయితే లాక్ డౌన్ ఆగష్టు 31 వ తేదీన ఎత్తి వేయనున్నారు. కేంద్రం జారీ చేసిన మార్గ దర్శకుల ప్రకారం ఆగష్టు నెల ఆఖరి తరువాత కరోనా కేసులను పరిశీలించి, అలాగే విద్యార్థుల, తల్లి దండ్రుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోనున్నారు.

అలాగే విద్యాసంస్థలు షిఫ్టుల వారీగా విద్య బోధించాలని తెలిపింది. తరగతి గదుల్లో విద్యార్ధులు 2 నుండి 3 గంటలు మాత్రమే ఉండలని తెలిపారు. అయితే మొదటి షిఫ్ట్ 8 నుండి 11 గంటల వరకు ఉండనుంది. రెండోవ షిఫ్ట్ 12 నుండి 3 గంటల వరకు నిర్వహించాలని సూచించింది. అలాగే షిఫ్ట్ పూర్తయిన తరువాత తరుగతి గదులను పూర్తిగా శానిటైజ్ చేయాలనీ తెలిపింది. ఈ నిబంధనలను ఉల్లంగిస్తే విద్యాసంస్థల పై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here