ఏపీ లో సెప్టెంబర్ 5 నుండి పాఠశాలలు ప్రారంభం

Advertisement

కరోనా మహమ్మారి దాటికి పాఠశాలలు, కాలేజీలు అన్ని కూడా మూతపడిపోయాయి. అయితే తాజాగా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ లోని పాఠశాలలు సెప్టెంబర్ 5 వ తేదీ నుండి ప్రారంభం అవుతాయని సీఎం జగన్ తెలిపారు. అలాగే ఆగస్టు 31వ తేదీ నాటికి పాఠశాలల్లో నాడు-నేడు పనుల పూర్తి కావాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

అలాగే నాడు-నేడు పనుల పై రెండు రోజులకు ఓకసారి జిల్లా కలెక్టర్లు సమీక్ష చేయాలని సూచించారు. ఆగస్టు 15వ తేదీన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని అన్నారు. ఇళ్లపట్టాల రిజిస్ట్రేషన్‍కు సంబంధించిన పనులన్నీ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ చేయడం నిరంతర ప్రక్రియ అని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here