ఏపీలో తెరుచుకొనున్న విద్యాసంస్థలు

Advertisement

ఈనెల 21నుండి 9,10 ఇంటర్ విద్యార్థులు విద్యాలయాలు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేంద్రప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఏపీ అన్‌లాక్‌-4 మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే ఇలా వెళ్ళడానికి తల్లిదండ్రుల రాత పూర్వక అనుమతి తప్పనిసరని వెల్లడించింది. అలాగే పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు కూడా కళాశాలలకు వెళ్లవచ్చని తెలిపింది. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు తెరచుకునేందుకు అనుమతినిచ్చింది. 100 మందికి మించకుండా సామాజిక, విద్య, క్రీడలు, మతపరమైన, రాజకీయ సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించింది.

ఈ నెల 20 నుంచి పెళ్లిళ్లకు 50 మందిని, అంత్యక్రియలకు 20 మందికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. 21 నుంచి ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్లకు అనుమతి ఇచ్చినప్పటికీ సినిమా హాళ్లు, స్విమ్మింగ్‌పూల్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్కులకు అనుమతి నిరాకరించింది. అయితే విద్యాలయాలు ఓపెన్ చేయాలన్న ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తుంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here