Telangana: స్కూల్స్, కాలేజ్‌లు మ‌రి కొన్ని రోజులు బంద్.. ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

Telangana: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండడంతో పాఠశాలలు నడపడంపై ప్రభుత్వం ఆలోచనలో పడింది. విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తే మంచిదనే యోచనలో ఉన్నట్టు సమాచారం. రేపటితో పండుగ సెలవులు ముగుస్తాయి. ఎల్లుండి నుండి స్కూల్స్ తెర‌చుకోను్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఈ సెల‌వుల‌ని మ‌రో 2 వారాలపాటు సెలవులు పొడిగించాలని భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది.

schools closed in telangana
schools closed in telangana

జనవరి తొలి వారంలోనే కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో సంక్రాంతి సెలవులను మూడు రోజులు ముందుకు జరిపి ఈనెల 8వ తేదీ నుంచే ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈనెల 16 వరకు సెలవులు ఉండగా.. 17 నుంచి విద్యా సంస్థలు తెరవాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మరికొద్ది రోజులు సెలవులు పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే కరోనా ఆంక్షలను ఈనెల 20 వ‌ర‌కు పొడిగించింది ప్రభుత్వం. దీనివల్ల రోజువారీ కేసుల సంఖ్య కాస్త త‌గ్గే అవ‌కాశం ఉంటుందని భావిస్తోంది. మరోవైపు ఈ నెల చివరి వరకు కేసులు భారీగా పెరగొచ్చని నిపుణులు చెబుతున్న కారణంగా నెలాఖరు వరకు విద్యాసంస్థలు మూసివేయాలని నిర్ణయించినట్టు సమాచారం.

schools closed in telangana1
schools closed in telangana1

ఆంక్ష‌ల నేప‌థ్యంలో విద్యా సంస్థలకు సెలవులు కూడా పొడిగించాలని వైద్య,ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. ఈనెల 20వ తేదీ వరకు రాష్ట్రంలో ర్యాలీలు, సభలను జరపరాదని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దాంతో సెలవులను కూడా 20వ తేదీ వరకు పొడిగిస్తారని చెబుతున్నారు. అలాకాకుండా ఎక్కువ రోజులు సెలవులు పొడిగిస్తే మాత్రం సర్కారు స్కూళ్లు, జూనియర్‌ కాలేజీ విద్యార్థులకు టీవీల ద్వారా ఆన్‌లైన్‌ పాఠాలను ప్రసారం చేయాల్సి ఉంటుంది.

కొవిడ్‌ కేసులు పెరుగుతున్నా ఆసుపత్రులలో చేరేవారు తక్కువగా ఉండడంతో భయపడాల్సిన పనిలేదన్నారు. మొదటి, రెండో విడతలలో వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉండేదన్నారు. దేశంలోనే కాకుండా విదేశాలలోనూ ఒమైక్రాన్‌, థర్డ్‌వేవ్‌ ప్రభావం తీవ్రం అనిపించుకోలేదన్నారు. అయినా పిల్లల్లోనూ వైరస్‌ తీవ్రమవుతుండడంతో భౌతికంగా తరగతులు సమంజసం కాదనే నిర్ణయం తీసుకుంటున్న‌ట్టు తెలుస్తుంది.