Sarayu Sensational Comments On Bigg Boss Show : బిగ్ బాస్ చూడకండి.. ఆ షో అంతా అబద్దం.. సరయు సంచలన కామెంట్లు..!
NQ Staff - July 25, 2023 / 10:24 AM IST

Sarayu Sensational Comments On Bigg Boss Show :
బిగ్ బాస్ కు మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ రియాల్టీ షో కోసం ఎంతో మంది ఎదురు చూస్తుంటారు. అయితే ఈ షోకు ఎంతటి క్రేజ్ ఉందో.. అంతే స్థాయిలో విమర్శలు కూడా వస్తుంటాయి. చాలామంది ఈ షో అంతా ఫేక్ అని చెబుతుంటారు. ఈ షోలో పాల్గొన్న వారు కూడా దీని గురించి చీప్ కామెంట్లు చేయడం మనం చూశాం.
ఇప్పుడు బిగ్ బాస్ కంటెంస్టెంట్ సరయు కూడా ఇలాంటి కామెంట్లు చేసింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఇప్పుడు వస్తున్న రియాల్టీ షోలు అన్నీ అబద్దమే. మనకు బయటకు కనిపించేది ఒకటి. అక్కడ జరిగేది ఇంకొకటి. నేను అందులో పాల్గొన్నాను కదా. నాకు అంతా తెలుసు. కొందరు తమను తాము ప్రమోట్ చేసుకోవడం కోసమే డబ్బులు ఇచ్చి మరీ ఆ షోలకు వస్తుంటారు.
కావాలనే అలా చేస్తారు..
షో యాజమాన్యం కూడా కావాలనే కొందరిని ప్రమోట్ చేస్తుంటారు. నన్ను అడిగితే అలాంటి షోలు చూడకపోతోనే బెటర్. అది నిజమే అని మనం పిచ్చోళ్లం అవుతాం. అంటూ సంచలన కామెంట్లు చేసింది సరయు. ఆమె గతంలో బిగ్ బాస్-5 సీజన్ లో అలాగే ఓటీటీఓ సీజన్ లో రెండింటిల పాల్గొంది.
కానీ రెండు సార్లు ఆమె మధ్యలోనే బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఆమె బిగ్ బాస్ మీద ఇలాంటి కామెంట్లు చేయడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి. ఆమె ఇప్పుడు సినిమాల్లో అలాగే యూట్యూబ్ సిరీస్ లతో బిజీగా ఉంది.