Sara Ali Khan : అతనితో పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నా.. శుభ్ మన్ గిల్ తో డేటింగ్ పై స్పందించిన సారా..!
NQ Staff - June 8, 2023 / 09:57 AM IST

Sara Ali Khan : గత కొన్ని రోజులుగా ప్రముఖ ఇండియన్ క్రికెటర్ శుభ్ మన్ గిల్ కు సంబంధించిన వార్తలు ఎంతగా వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఆయన క్రికెట్ కు సంబంధించిన వార్తల కంటే కూడా వ్యక్తిగతంగా డేటింగ్ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. ఆయన గతంలో సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ తో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి.
ఆ వెంటనే బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్ తో డేటింగ్ లో ఉన్నట్టు సమాచారం బయటకు వచ్చింది. వీరిద్దరూ అప్పుడప్పుడు రెస్టారెంట్లకు వెళ్లిన ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈ వార్తలపై సారా అలీఖాన్ స్పందించింది. ఆమె తాజగా నటించిన మూవీ `జర హట్ కే జర బచ్ కే` మూవీ ప్రమోషన్ లో ఈ వార్తలపై స్పందించింది.
ఆమె మాట్లాడుతూ.. నాకు క్రికెటర్ ను పెండ్లి చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ నేను నా జీవిత భాగస్వామిని ఇంకా కలవలేదనే అనుకుంటున్నా. కచ్చితంగా భరోసాతో ఈ మాటలను చెబుతున్నా. నా సంప్రదాయాలను గౌరవించే వ్యక్తి దొరికినప్పుడు కచ్చితంగా అతనితో జీవితాన్ని పంచుకుంటా.
అతను ఏ రంగంలో ఉన్నా సరే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. సినిమా, క్రికెట్, వ్యాపారం ఇలా ఏ రంగంలో ఉన్నా సరే అతన్ని పెండ్లి చేసుకుంటా. నాకు ఎలాంటి అభ్యంతరం లేదని, నా విలువలను గౌరవిస్తే చాలని పేర్కొందీ హాట్ బ్యూటీ. ఈ కామెంట్లు ఇన్ డైరెక్టుగా శుభ్ మన్ గిల్ ను ఉద్దేశించే ఉన్నాయని అంటున్నారు నెటిజన్లు.