Sanya Malhotra : ఆ పార్టుకు సర్జరీ చేసుకోమన్నాడు.. డైరెక్టర్ పై హీరోయిన్ ఫైర్..!
NQ Staff - June 7, 2023 / 10:26 AM IST

Sanya Malhotra : సినిమా రంగం అంటేనే ఇప్పుడు గ్లామర్ ప్రపంచం. ఇక్కడ ఎంత అందంగా ఉంటే అంత ఎక్కువ కాలం నిలదొక్కుకుంటాం. లేదంటే మధ్యలోనే వెనుదిరగాల్సి వస్తుంది. హీరోయిన్లకు బాడీలోని ప్రతి పార్టు హాట్ గా ఉండాలనే రూల్ ను కొందరు దర్శకులు పెట్టేస్తున్నారు. దాంతో హీరోయిన్లు కూడా తమ పార్టులను అందంగా రెడీ చేసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే కొందరు హీరోయిన్లకు బాడీ పార్టుల విషయంలో అవమానాలు కూడా ఎదురవుతుంటాయి. కొందరు వాటిని బయట పెడుతూ ఉంటారు. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ఇలాగే తన బాధను బయట పెట్టింది. ఆమె ఎవరో కాదండోయ్ దంగల్ సినిమా నటి సన్యా మల్హోత్రా.
ఆమె గతంలో శకుంతల దేవి, లవ్ హాస్టల్, హిట్: ది ఫస్ట్ కేస్ సినిమాల్లో నటించింది. ఇక రీసెంట్ గా నటించిన ‘కథల్’ మూవీ ప్రమోషన్ లో ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. నేను దంగల్ సినిమా చేస్తున్నప్పుడు ఓ డైరెక్టర్ నా దగ్గరకు వచ్చి నా దవడకు సర్జరీ చేయించుకోమని చెప్పాడు.
అప్పుడే నీకు మంచి అవకాశాలు వస్తాయని చెత్త సలహా ఇచ్చాడు. కానీ నేను దాన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే నా దవడను చూసి నాకు ఛాన్సులు రావట్లేదు.. పోవట్లేదు. నా ట్యాలెంట్ తోనే వస్తున్నాయి. అతనికి కూడా అదే చెప్పాను అంటూ అతనిపై ఈ సందర్భంగా ఫైర్ అయింది సన్యా మల్హోత్రా.