Sanju Bhagat Man Became Pregnant : నాగ్ పూర్ లో గర్భవతుడు.. ఇద్దరు పిల్లల్ని కడుపులో మోసిన వ్యక్తి..!
NQ Staff - June 25, 2023 / 11:29 AM IST

Sanju Bhagat Man Became Pregnant : వైద్య శాస్త్రంలోనే ఇది అరుదైన ఘట్టం. అసలు ఇలా జరుగుతుందని కూడా ఎవరూ ఊహించలేరేమో. ఎందుకంటే పిల్లల్ని కనేది కేవలం ఆడవారు మాత్రమే. ఈ సృష్టిలో పిల్లల్ని కనే శక్తి కేవలం వారికి మాత్రమే ఉంది. అయితే సృష్టిలోనే మొదటిసారి ఓ వ్యక్తి గర్భవుతుడు అయ్యాడు. వినడానికే ఆశ్చర్యంగాఉన్నా ఇది నిజమే.
ఆడవారు తొమ్మిది నెలలు మాత్రమే పిల్లల్ని కడుపులో మోస్తే.. ఈ వ్యక్తి మాత్రం ఏకంగా 36 ఏళ్లు తన కడుపులో పిల్లల్ని మోశాడు. మహారాష్ట్రకు చెందిన సంజు భగత్ కు సంబంధించిన స్టోరీ ఇది. ఈ విషయం 1999లో తొలిసారి వెలుగులోకి వచ్చింది. సంజు భగత్ తాను పుట్టినప్పటి నుంచే కాస్త పొట్టతో ఉండేవాడు.
ఆయన ఊరిలో ఉబ్బుగా ఉండే పొట్టతోనే తిరిగేవాడు. దాంతో ఆయన్ను చూసిన వారంతా కూడా ప్రెగ్నెంట్ అంటూ ఏడిపించేవారు. కానీ ఆయన మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన లైఫ్ లో ముందుకు వెళ్లాడు. కానీ ఆయన వయసు పెరిగే కొద్దీ పొట్ట మరింత పెరుగుతూ వచ్చింది. చివరకు ఊపిరి తీసుకోవడం కూడా ఇబ్బందిగానే మారింది.
దాంతో ఆయన 1999లో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు అన్ని టెస్టులు చేసిన డాక్టర్లు.. కడుపులో ఏదో గడ్డ లాగా ఉందని గుర్తించారు. వెంటనే ఆపరేషన్ మొదలు పెట్టారు. కానీ కడుపులో ఉన్నది చూసి డాక్టర్లు షాక్ అయ్యారు. ఒక్కొక్కటిగా మనిషి అవయవాలు బయటకు వచ్చాయి.
ఇద్దరు కవల పిల్లల్ని కడుపులో నుంచి తీసేశారు డాక్టర్లు. దాదాపు 36 ఏళ్లుగా ఈ కవల పిల్లల్ని సంజు భగత్ మోస్తున్నట్టు తెలిపారు. అడ్డదిడ్డంతా అవయవాలు పెరిగాయి ఆ పిండాలకు. ఇలా మనిషి కడుపులో పిల్లలు ఉండటాన్ని ఫీటస్ ఇన్ ఫీటు అంటారు వైద్య పరిభాషలో. అంటే పిండం లోపల పిండం అన్నమాట.
సంజు భగత్ తన అమ్మ కడుపులో ఉన్నప్పుడే ఆయనలో మరో పిండం పురుడు పోసుకుంది. అదే ఆయన్ను ఇబ్బంది పెట్టింది. ఈ కథనాన్ని తాజాగా ది డైలీ స్టార్ బయట పెట్టింది. దాంతో ఈ మ్యాటర్ కాస్తా వైరల్ అవుతోంది. సంజు భగత్ వయసు ఇప్పుడు 60 ఏళ్లు. ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నాడు.