Sanjay Manjrekar: అశ్విన్‌ పనికి రాడంటూ దారుణ‌మైన వ్యాఖ్య‌లు చేసిన సంజ‌య్ మంజ్రేక‌ర్

Sanjay Manjrekar: చెన్నైఆట‌గాడు ర‌విచంద్ర‌న్ అశ్విన్ భార‌త క్రికెట్‌కు త‌న స్పిన్ మాయాజాలంతో చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యాలు అందించారు. టీ 20 మ్యాచ్‌ల‌లో కూడా అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. అయితే తాజాగా ఆయ‌న‌పై మాజీ క్రికెట‌ర్ సంజ‌య్ మంజ్రేక‌ర్ చేసిన కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి.

Sanjay Manjrekar Made a Bold Statement Against Ravi Ashwin
Sanjay Manjrekar Made a Bold Statement Against Ravi Ashwin

గత కొన్నేళ్లుగా ఐపీఎల్‌లో అశ్విన్‌ను ఎందుకు ఆడిస్తున్నారో అర్ధం కావడం లేదని, నేనైతే అశ్విన్‌ను అసలు జట్టులోకే తీసుకోనని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్‌ఫో టైమ్ ఔట్ లైవ్ షోలో.. మాట్లాడుతూ అశ్విన్‌పై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశాడు.

‘టీ20 ప్రపంచకప్ జట్టులో అశ్విన్‌ను అనవసరంగా తీసుకున్నారు. ఇప్పటికే చాలా సమయాన్ని వృధా చేశాం. టీ20 బౌలర్‌గా అతను ఏ జట్టుకు కూడా ఉపయోగపడింది లేదు. టీ20 ఫార్మాట్‌లో అశ్విన్‌ బౌలింగ్‌ శైలి మారాలనుకుంటే అది జరిగేది ​కాదు. గత ఐదారేళ్లుగా ఐపీఎల్‌లో అతను ప్రాతినిథ్యం వహించిన ప్రతి జట్టుకు భారంగానే ఉన్నాడు.

వికెట్‌ టేకింగ్‌ బౌలర్ల అయిన వరుణ్‌ చక్రవర్తి, సునీల్‌ నరైన్‌, యుజ్వేంద్ర చహల్‌‌లను ఎంచుకుంటాను. టెస్ట్‌ ఫార్మాట్‌లో అశ్విన్‌‌కు తిరుగు లేదు. సుదీర్ఘ ఫార్మాట్‌లో అతనో అద్భుతమైన బౌలర్. కానీ టీ20 ఫార్మాట్‌కు మాత్రం పనికి రాడంటూ సంజ‌య్ హాట్ కామెంట్స్ చేశాడు.