బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు లంగ్ కాన్సర్ అమెరికాకు తరలింపు
Admin - August 12, 2020 / 06:01 AM IST

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అనారోగ్యంతో ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే శ్వాస సమస్యలు, ఛాతిలో నొప్పితో మూడు రోజుల క్రితం ఆయన ఆ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అలాగే కరోనా సోకిందేమో అనే అనుమానంతో పరీక్షలు కూడా చేయించుకున్నాడు. ఆ పరీక్షల్లో కరోనా నెగెటివ్ అని నిర్దారణ అయింది. దీనితో ఆయనను అత్యవసర వార్డు నుంచి సాధారణ వార్డుకు తరలించారు. అలాగే సంజయ్ దత్‌కు మరికొన్ని పరీక్షలు నిర్వహించారు. దీనితో ఆయనకు లంగ్ క్యాన్సర్ వచ్చినట్లు బయట పడింది.
ఆయన ప్రస్తుతం 3వ దశ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు సమాచారం వస్తుంది. దీనితో ఆయనను వెంటనే అమెరికా వెళ్లి, క్యాన్సర్ చికిత్స తీసుకోవాలని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో సంజయ్ దత్ ట్విట్టర్ ద్వారా తానే స్వయంగా స్పందించారు. తాను కొంతకాలం షూటింగ్స్ నుంచి విరామం తీసుకోనున్నట్లు వెల్లడించాడు. అలాగే తన కుటుంబం, స్నేహితులు తనతో ఉన్నారని అభిమానులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని కోరారు. మీ ప్రేమ అభిమానులతో తిరిగి ఇండియాకు వస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని అన్నాడు.