కురిచేడు శానిటైజర్ తాగిన మృతుల వెనుక రహస్యం

Advertisement

ఏపీ లోని ప్రకాశం జిల్లాలో శానిటైజర్ తాగి చనిపోయారు కొందరు మందు బాబులు. అయితే ఈ శానిటైజర్ వెనుక ఉన్న బండారాన్ని బయట పెట్టారు పోలీసులు. ఇక వివరాల్లోకి వెళితే హైదరాబాద్ జీడిమెట్ల ప్రాంతానికి చెందిన ఫర్ఫెక్ట్‌ శానిటైజర్‌ కంపెనీ యజమాని శ్రీనివాస్‌ మూడవ తరగతి మాత్రమే చదువుకున్నాడు. ఇక అతడు స్ధానికంగా పర్ఫెక్ట్‌ కిరాణా మర్చంట్స్‌ పేరుతో గృహా అవసరాలకు ఉపయోగపడే దుకాణాన్ని నడిపినట్లు సిట్ అధికారులు గుర్తించారు. అలాగే అతను లాక్‌డౌన్ విధించిన‌ సమయంలో శానిటైజర్లు, మాస్క్‌లు అమ్మకాలు మొదలు పెట్టాడు.

కరోనా నేపథ్యంలో ఈ వ్యాపారం కు మంచి గిరాకీ ఉండడంతో యూట్యూబ్‌లో శానిటైజర్ ఫార్ములా విధానంను నిర్వహకుడు ఆచరణలో పెట్టాడు. ఎలా అయిన శానిటైజర్ ను తయారు చేయాలనుకున్నాడు. అయితే ఈ శానిటైజర్ తయారు చేయడంలో ల్యాబ్‌ టెక్నీషియన్లు, అనుమతుల నియమ నిబంధనలను బేఖాతరు చేసారు. అయితే ఈ శానిటైజర్‌ తయారీలో ఇథైల్‌ ఆల్కహాల్‌తో పాటు మిథైల్‌ క్లోరైడ్‌ను కూడా ఉపయోగించడం వలన కురిచేడు ఘటనలో 16మంది మృతి చెందినట్లు సిట్ అధికారులు నిర్ధారణ చేసారు.

అయితే ఈ శానిటైజర్ ను అన్ని మెడికల్ షాపులకు కాకుండా కురిచేడులోని కొన్ని మెడికల్‌ షాపులకు మాత్రమే సరఫరా చేసినట్లు సిట్ సేకరించిన రికార్డుల్లో తెలిసింది. ఈ శానిటైజర్లను జిల్లాలో పర్ఫెక్ట్‌ కంపెనీ శానిటైజర్‌ గా దర్శికి చెందిన ఓ డిస్ట్రిబ్యూటరు ను ఎంపిక చేసి స్థానికంగా అమ్మకాలు సాగించినట్లు విచారణలో వెల్లడించారు. ప్రస్తుతం దర్శి డిస్టీబ్యూటర్స్ పరారీ లో ఉన్నాడు. అతని కోసం సిట్ అధికారులు వెతుకుతున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here