Samyuktha Menon : 63 ఏళ్ల నటుడితో రొమాన్స్ చేసిన సంయుక్తా మీనన్.. డబ్బుల కోసమేనట..!
NQ Staff - June 17, 2023 / 11:17 AM IST

Samyuktha Menon : ఇప్పుడు చాలామంది హీరోయిన్లు కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. ఎన్ని సినిమాలు చేశామా అన్నది ముఖ్యం కాదు.. ఎంత సంపాదించామా అన్నదే వారికి ముఖ్యం. ఎలాగూ ఇప్పటి ఇండస్ట్రీలో కాంపిటీషన్ చాలా ఎక్కువ అయిపోయింది. అందుకే ఎలాంటి పాత్రలు వచ్చినా సరే చేసేస్తున్నారు.
ఇక చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. సంయుక్తా కూడా గతంలో ఇదే పని చేసింది. ఇప్పుడు ఆమె పేరు టాలీవుడ్ లో మార్మోగిపోతోంది. వరుసగా ఆమెకు అవకాశాలు ఇస్తున్నారు. పైగా చేస్తున్న సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే అవుతున్నాయి. దాంతో ఆమెకు యంగ్ హీరోలు వరుసగా ఛాన్సులు ఇస్తున్నారు.
అయితే గతంలో ఆమె 63 ఏళ్ల నటుడితో రొమాన్స్ చేసింది. అతను ఎవరో కాదండోయ్ నటుడు నాజర్. అవును వీరిద్దరూ కలిసి ఎరిడా అనే మలయాళ సినిమాలో నటించారు. ఇందులో నాజర్ తో కలిసి రచ్చ రంబోలా అనే రేంజ్ లో సంయుక్త రొమాన్స్ చేసింది. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. కానీ ఇందులో సంయుక్తా ఓ రేంజ్ లో బోల్డ్ నెస్ ను చూపించింది.
ఇక తాజాగా ఈ విషయం తెలుసుకున్న ఆమె ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతున్నారు. అయ్యో సంయుక్తా చివరకు డబ్బుల కోసం ఇలాంటి పాత్రలు కూడా చేశావా అంటూ అడుగుతున్నారు. సంయుక్త ఇప్పుడు ఎలాంటి పాత్ర వచ్చినా సరే చేయడానికి రెడీగా ఉంటున్న విషయం మనకు తెలిసిందే. మరి ఈ పాత్ర కూడా ఆమె డబ్బుల కోసమే చేసిందేమో.