Yashoda : ‘యశోద’ ఓటీటీ రిలీజ్‌కి ఝలక్.! విడుదల చెయ్యకూడదన్న కోర్టు.!

NQ Staff - November 24, 2022 / 06:37 AM IST

Yashoda : ‘యశోద’ ఓటీటీ రిలీజ్‌కి ఝలక్.! విడుదల చెయ్యకూడదన్న కోర్టు.!

Yashoda : సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘యశోద’ మంచి వసూళ్ళను సాధించిన సంగతి తెలిసిందే. త్వరలో ఓటీటీలోకి ‘యశోద’ రాబోతోందంటూ ప్రచారం జరుగుతున్న వేళ, ‘యశోద’ ఓటీటీ రిలీజ్‌కి న్యాయస్థానం బ్రేకులేసింది.

సరోగసీ నేపథ్యంలో ‘యశోద’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అందులో ‘ఇవా’ పేరుతో ఓ హాస్పిటల్‌ని చూపించారు. ఆ పేరుతో వున్న హాస్పిటల్ యాజమాన్యమొకటి కోర్టును ఆశ్రయించడంతో ‘యశోద’ ఓటీటీ విడుదలకు బ్రేకు పడింది.

సినిమాతో సమస్య రాలేదా.?

‘యశోద’ సినిమా కారణంగా తమ సంస్థ ప్రతిష్ట దెబ్బ తిందని ఇవా హాస్పిటల్ నిర్వాహకులు కోర్టుకు తెలిపారు. ఓటీటీలో సినిమాని విడుదల చేయకుండా చూడాలని సదరు సంస్థ న్యాయస్థానాన్ని కోరింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 19న ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వాల్సిన ‘యశోద’కి షాక్ తగిలినట్లయ్యింది.

తదుపరి విచారణను డిసెంబర్ 19వ తేదీకి వాయిదా వేసింది న్యాయస్థానం. కాగా, ‘ఇవా’ సంస్థ పిటిషన్ నేపథ్యంలో ‘యశోద’ చిత్ర నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేసింది సిటీ సివిల్ కోర్టు. ‘యశోద’ నిర్మాతలు ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us