బిగ్ బాస్ హోస్ట్ గా సమంత :

Advertisement

బిగ్ బాస్ హోస్ట్ గా సమంత.. తెలుగు లో త్వరలో మొదలు కానున్న బిగ్ బాస్ సీజన్ 4 కి హోస్ట్ గా హీరోయిన్ సమంత ని తీసుకోనున్నారా? వివరాల్లోకి వెళితే బాస్ బుల్లి తెర పైన సంచలన విజయాలు సాధించిన షో.. హిందీ తమిళ్ తెలుగు ఇలా పలు భాషల్లో నడిచే ఈ షో కి ఆయా భాషల్లో అంత పేరు మరియు సక్సెస్ దక్కింది… అందువలన ఈ షో ని సీజన్ ల వైస్ గా పొడిగిస్తూనే ఉన్నారు .

అయితే తెలుగు లో ప్రచురితమయ్యే సీజన్ 1 కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా ఆ సీజన్ అబ్దుత విజయాన్ని సాధించి మంచి TRP ని తెచ్చిపెట్టింది.. ఆ తరువాత సీసన్ 2 కి నాని హోస్ట్ గా వ్యవహరించాడు. అది కూడా మంచి పేరు ని సాధించింది. అలాగే 3 వ సీసన్ కి మన్మధుడు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించగా ప్రేక్షకులు ఎగబడి మరి చూసారు. ఇలా ప్రతి సీజన్ కు విపరీతమైన ఆదరణ లభిస్తుండడం తో మా యాజమాన్యం బిగ్ బాస్ సీజన్ 4 ని మొదలు పెట్టాలని చూస్తుంది . ఇప్పటికి దాని కోసం కంటెస్ట్నట్స్ ని వెతికే ప్రయత్నాల్లో ఉంది.. కొంత మంది పార్టిసిపెంట్స్ ని ఇప్పటికే ఫైనల్ చేసినప్పటికీ మరి కొంత మంది ని ఎవరిని తీసుకోవాలా అన్న సంప్రదింపులు జరుపుతున్నారు..

దానిలో భాగం గానే హోస్ట్ ని కూడా ఎవరిని తీసుకోవాలి అన్న ఆలోచనలో ఉన్నారు. ఇప్పటి వరకు మూడు సీజన్ లకు హోస్ట్ లుగా ముగ్గురు హీరో లను తీసుకోగా నాలుగవ సీజన్ లో మొదటిగా మరల నాగార్జున నే హోస్ట్ గా అనుకున్నప్పటికీ, ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు కూడా పరిశీలనలోకి తీసుకున్నారు అయితే తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ 4 కి హోస్ట్ గా సమంత ని తీసుకొనే ఆలోచన చేస్తున్నారు అంట మా యాజమాన్యం …..

దానికోసం సమంత ని కలిసి సంప్రదింపులు జరపనున్నట్లు తెలుస్తుంది ఒక వేళ అది నిజం అయ్యి సమంత ని బిగ్ బాస్ హోస్ట్ గా తీసుకున్నట్లైతే ఇంత వరకు ఏ భాషలో ఏ సీజన్ లో దక్కని ఘనత తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 కి మరియు సమంత కి దక్కే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బిగ్ బాస్ లో ఇంతవరకు ఏ భాషలో కూడా ఒక లేడీ హోస్ట్ లేకపోవడమే.. సమంత బిగ్ బాస్ కి హోస్ట్ గా చేసినట్లయితే మొదటి బిగ్ బాస్ లేడీ హోస్ట్ గా సమంత పేరు బిగ్ బాస్ చరిత్రలో నిలిచిపోతుంది. వస్తున్న వార్తలని బట్టి ఇది నిజమో కాదో కచ్చితంగా తెలియాలంటే మా యాజమాన్యం దీని పైన అధికార ప్రకటన ఇచ్చే అంత వరకు వేచి చూడాల్సిందే.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here