మాల్దీవుల‌కి గుడ్ బై చెప్పిన స‌మంత‌.. హైద‌రాబాద్‌లో షార్ట్‌తో ప్ర‌త్య‌క్షం

క‌రోనా వ‌ల‌న దాదాపు ఏడు నెల‌లు ఇంటికే ప‌రిమిత‌మైన స‌మంత‌- నాగ చైత‌న్య జంట కాస్త రిలాక్సేష‌న్ కోసం వెకేష‌న్‌కు వెళ్ళారు. చైతూ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మాల్దీవుల‌కి వెళ్ళిన ఈ జంట ఆ ప్ర‌కృతిని బాగా ఎంజాయ్ చేసింది. మంచి లొకేష‌న్స్‌లో ఫొటోలు దిగుతూ వాటికి సంబంధించిన అప్‌డేట్స్‌ని ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేసింది. ఇప్ప‌టికీ స‌మంత మాల్దీవుల‌కి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉన్నాయి. అయితే నవంబర్ 23న మాల్దీవ్స్ వెళ్ళిన ఈ జంట రీసెంట్‌గా హైద‌రాబాద్‌కు వ‌చ్చింది. ఎయిర్ పోర్ట్ లో నాగచైతన్య, సమంత న‌డుచుకుంటూ వ‌స్తున్న‌ ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

ఎయిర్‌పోర్ట్‌లో సమంత‌ని చూసిన అభిమానులు షాక్ అయ్యారు. షార్ట్‌తో ఈ అమ్మ‌డు ప్రత్య‌క్షం అయ్యే స‌రికి అంద‌రి కళ్ళు అటు వైపే తిరిగాయి. మాల్దీవుల‌లో త‌న అందాల‌తో క‌నువిందు చేసిన స‌మంత ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న వారిని కూడా ఉత్సాహ‌ప‌రిచింది. ప్ర‌స్తుతం ఎయిర్ పోర్ట్ పిక్స్‌కు నెట్టింట తెగ హ‌ల్ చేస్తున్నాయి. ఇక వ‌ర్క్‌కు కాస్త గ్యాప్ ఇచ్చి విహార‌యాత్ర‌కు వెళ్లిన ఈ జంట మ‌ళ్లీ ఎవ‌రి ప‌నుల‌తో వారు బిజీ కానున్నారు. నాగచైతన్య చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో మొదటిది శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ. ఈ సినిమా ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకోగా, ప్ర‌స్తుతం థ్యాంక్యూ అనే సినిమా చేస్తున్నాడు.

ఇక స‌మంత విష‌యానికి వ‌స్తే ఈ ఏడాది జాను చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సామ్ త్వ‌ర‌లో నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నుంది. త‌నికెళ్ల భ‌ర‌ణి ద‌ర్శ‌కత్వంలోను ఓ ప్రాజెక్ట్ చేయ‌నుంది. ఇందులో రాఘ‌వేంద్ర‌రావు ముఖ్య పాత్ర పోషించ‌నున్నారు. ర‌మ్య‌కృష్ణ‌, ర‌కుల్ కీల‌క పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ షోని హోస్ట్ చేసిన స‌మంత ప్ర‌స్తుతం ఆహా అనే ప్లాట్‌ఫాం కోసం సామ్ జామ్ అనే షో చేస్తుంది. దీనికి హోస్ట్‌గా ప‌ని చేస్తుంది. ఫ్యామిలీ మెన్ 2 అనే వెబ్ సిరీస్‌లోను స‌మంత న‌టిస్తుంది.

Advertisement