SAMANTHA: ఆటో డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తున్న యువ‌తికి స‌మంత స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్‌.. ఆనందంలో క‌విత‌

అక్కినేని కోడ‌ల స‌మంత మంచి న‌టే కాదు, సేవా దృక్ప‌థం గ‌ల వ్య‌క్తి కూడా. ఆప‌దలో ఉన్న వారికి త‌న వంతు సాయం చేస్తూ వ‌స్తున్న స‌మంత .. ప్ర‌త్యూష అనే ఫౌండేష‌న్‌ను స్థాపించి అనాథ చిన్నారుల‌కు అండ‌గా నిలుస్తూ వ‌స్తుంది. తాజాగా సంగారెడ్డి జిల్లా మనూరు మండలం డోవూర్‌ చందర్‌ నాయక్‌ తండాకు చెందిన క‌విత అనే ఆటో డ్రైవర్‌కు ఆశ్య‌ర్యపోయే గిఫ్ట్ ఇచ్చి అంద‌రు అవాక్క‌య్యేలా చేసింది.

వివ‌రాల‌లోకి వెళితే క‌విత అనే ఆటో డ్రైవర్ ఆరు నెల‌ల క్రితం హైద‌రాబాద్ లోని అన్న‌పూర్ణ స్టూడియోలో నిర్వ‌హించిన ప్రైవేట్ ప్రోగ్రాంలో పాల్గొంది. అందులో త‌ను డోవూర్ చంద‌ర్ నాయ‌క్ తండాకు చెందిన యువ‌తినని చెప్పిన క‌విత‌, భ‌ర్త రోజూ తాగొచ్చి క‌ట్టేవాడు. వేధింపులు భ‌రించ‌లేక పుట్టింటికి వ‌చ్చి పొలం ప‌నుల‌కు వెళుతూ ఏడుగురు చెల్లెళ్ల‌కు అండగా నిలిచిన‌ట్టు చెప్పుకొచ్చింది. త‌న తల్లిదండ్రులు చనిపోయాక కుటుంబ పోష‌ణ మ‌రింత భారం కావ‌డంతో ఆటో డ్రైవింగ్ నేర్చుకొని హైద‌రాబాద్‌కు వ‌చ్చిన‌ట్టు క‌విత పేర్కొంది. మీయాపూర్‌ టూ బాచుపల్లిలో ప్ర‌స్తుతం ఆటో న‌డుపుతుండగా, ఈమె జీవిత చ‌రిత్ర‌ను తెలుసుకున్న స‌మంత ..క‌విత‌కు రూ.12.50 లక్షల విలువ చేసే స్విఫ్ట్‌ డిజైర్‌ కారును అందజేశారు. సమంత ఇచ్చిన బ‌హుమ‌తి చూసి క‌విత సంబ‌ర‌ప‌డిపోతుంది.

Advertisement