Samantha : సామ్ నిర్ణయంతో షాక్ అవుతున్న టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్
NQ Staff - May 27, 2023 / 11:00 AM IST

Samantha : స్టార్ హీరోయిన్ సమంత వరుసగా బాలీవుడ్ సినిమాలకు ఓకే చెప్తుందని.. ఇకపై హిందీలోనే నటించేందుకు ఆమె ఆసక్తి చూపిస్తుందంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. హిందీలో సిరీస్ లు మరియు సినిమాల్లో వరుసగా ఆఫర్స్ వస్తున్న కారణంగా తెలుగు మరియు తమిళ సినిమాలను కమిట్ అవ్వకుండా కేవలం అక్కడి వారితో మాత్రమే ఒప్పందాలు కుదుర్చుకుంది.
ఈ నేపథ్యంలో ముందు ముందు కూడా సమంత ఉత్తరం భారతంలోనే సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ చాలా మంది భావించారు. కానీ సమంత వరుసగా తెలుగు సినిమాలకు సైన్ చేస్తుంది.
ఆమె ఇటీవల శాకుంతలం సినిమాతో నిరాశ పరిచింది అయినా కూడా తెలుగు లో మూడు నాలుగు సినిమాలు చేసేందుకు ఒప్పందం కుదిరినట్లుగా సమాచారం అందుతుంది. నందిని రెడ్డి దర్శకత్వంలో ఇప్పటికే ఒక సినిమా కన్ఫర్మ్ అయింది.
మరో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఇక విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న ఖుషి సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. అతి త్వరలోనే రెండు మూడు కొత్త సినిమాల షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. హిందీ సినిమాలకే పరిమితం అవుతుందని భావించిన సమంత వరుసగా తెలుగులో సినిమాలు చేయడం ఆశ్చర్యంగా ఉందంటూ టాలీవుడ్ ఫిలిం మేకర్స్ కామెంట్స్ చేస్తున్నారు.