Samantha : సమంత మహానటి.! తేల్చేసిన అల్లు అరవింద్, సురేష్‌బాబు.!
NQ Staff - December 3, 2022 / 11:02 AM IST

Samantha : సమంత గురించి కొత్తగా చెప్పేదేముంది.? స్టార్ హీరోయిన్.! లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది సమంత. ‘యశోద’ సినిమాతో ఆమె రేంజ్ మరింత పెరిగింది.
నిజానికి, సమంతకు తిరుగులేని స్టార్‌డమ్‌ని తెచ్చింది ‘ది ఫ్యామిలీ మ్యాన్’ అనే వెబ్ సిరీస్. అందులో సమంత పోరాటాలు, ఆమె నటన.. అత్యద్భుతమంతే.!
ఇంతకీ, సమంతని మహానటి అనొచ్చా.?
ఇప్పుడున్న హీరోయిన్లలో ‘మహానటి’ అవదగ్గ సీన్ ఎవరికి వుంది.? అన్న ప్రశ్న వస్తే, తడుముకోకుండా సమంత అని సమాధానమిచ్చేశారు ఇద్దరు సినీ ప్రముఖులు. ఆ ఇద్దరూ ప్రముఖ నిర్మాతలే. అందులో ఒకరు సురేష్‌బాబు అయితే, ఇంకొకరు అల్లు అరవింద్.
నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తోన్న ‘ఆహా’ అన్‌స్టాపబుల్ టాక్ షో సందర్భంగా ఈ విషయం బయటపడింది. అరవింద్, సురేష్‌బాబు అంటే, సినీ పరిశ్రమలో బోల్డంత అనుభవం వున్న నిర్మాతలు.
ఆ ఇద్దరూ ఏకగ్రీవంగా ఓట్ వేశారంటే, సమంతను మించిన మహానటి ఎవరున్నారు.?
ఇంతకీ, ‘మహానటి’ ట్యాగ్ వున్న కీర్తి సురేష్ ఎందుకు ఆ ఇద్దరి మనసుల్నీ గెలుచుకోలేక పోయిందబ్బా.?