Samantha : వామ్మో.. సమంత వేసుకున్న చెప్పుల ఖరీదు అన్ని లక్షలా..!

NQ Staff - June 16, 2023 / 09:22 AM IST

Samantha : వామ్మో.. సమంత వేసుకున్న చెప్పుల ఖరీదు అన్ని లక్షలా..!

Samantha  : సౌత్ స్టార్ హీరోయిన్ గా సమంత ఇప్పుడు ఫుల్ బిజీగా గడుపుతోంది. కొన్ని నెలల క్రితమే ఆమె విడాకుల బాధ నుంచి బయటకు వచ్చి.. మళ్లీ తన కెరీర్ మీద ఫోకస్ పెడుతోంది. గతంలో మాదిరిగానే చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది ఈ భామ. పెళ్లికి ముందు కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే సినిమాలు చేసింది.

కానీ ఇప్పుడు బాలీవుడ్, హాలీవుడ్ రేంజ్ కు వెళ్లిపోయింది ఈ భామ. సమంత ఇప్పుడు విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమాలో నటిస్తోంది. దాంతో పాటు సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. అలాగే రీసెంట్ గానే ఓ హాలీవుడ్ సినిమాకు కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇక సమంత ఈ నడుమ చాలా లగ్జరీ లైఫ్‌ స్టైల్ ను మెయింటేన్ చేస్తోంది.

వేసుకునే బట్టల దగ్గరి నుంచి.. కాళ్లకు ధరించే చెప్పుల వరకు అన్నీ లక్షల్లోనే ఉండేలా చూసుకుంటోంది. తాజాగా ఆమె ఎయిర్ పోర్టు నుంచి బయటకు వస్తుండగా కొందరు వీడియోలు తీశారు. ఇందులో సమంత వేసుకున్న చెప్పుల ఖరీదు ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చేసింది.

వీటి ఖరీదు రూ.2 లక్షల 58 వేల 97 రూపాయలు. ఈ ధర తెలిసి అంతా షాక్ అవుతున్నారు. వామ్మో సమంత ఇంత లగ్జరీ లైఫ్‌ ను మెయింటేన్ చేస్తోందా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు సమంత సంపాదిస్తోంది మొత్తం ఆమెకే సొంతం కాబట్టి.. ఇలా ఎంజాయ్ చేస్తుందేమో అంటున్నారు ఆమె ఫ్యాన్స్.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us