Samantha : మేకప్, షూటింగ్, ప్రమోషన్స్, న్యూ స్క్రిప్ట్స్ నేరేషన్స్.. వరుస షెడ్యూల్సుతో వారెవ్వా అనిపిస్తున్న సమంత 2.0

NQ Staff - January 24, 2023 / 01:40 PM IST

Samantha : మేకప్, షూటింగ్, ప్రమోషన్స్, న్యూ స్క్రిప్ట్స్ నేరేషన్స్.. వరుస షెడ్యూల్సుతో వారెవ్వా అనిపిస్తున్న సమంత 2.0

Samantha : వెండితెర మధురవాణి ఏం చేసినా వార్తే. వరుస పోస్టులు, కామెంట్లతో సందడి చేసినా, సోషల్మీడియా అకౌంట్లో ఏమీ అప్ లోడ్ చేయకపోయినా, వరుసగా సినిమాలు చూస్తూ బిజీగా ఉన్నా, పర్సనల్ రీజన్స్ వల్ల గ్యాప్ తీసుకున్నా.. ఇలా ఏమి చేసినా, చేయకపోయినా న్యూసే. అలాంటి సమంత కొంచెం గ్యాప్ తర్వాత శాకుంతలం ట్రైలర్ లాంచ్ ఈవెంటుతో రీ ఎంట్రీ ఇచ్చింది.

అలా వచ్చిందో లేదో.. సామ్ లుక్స్ పై, ఆమె ఫిజిక్ పై, చేతిలో పట్టుకున్న మాలతో సహా రకరకాల వార్తలు సోషల్మీడియాలో చక్కర్లు కొట్టడం స్టార్టయిపోయింది. మొత్తానికి ట్రీట్మెంట్ తర్వాత హెల్త్ సెట్టవడంతో ఇక మళ్లీ షూటింగులతో బిజీ అయ్యే పనిలో పడింది సామ్.

ఆల్రెడీ ఒప్పుకున్న ప్రాజెక్టులు సమంత వల్ల ఆలస్యం కావడంతో వెంట వెంటనే వాటిని ఫినిష్ చేయడానికి చూస్తోంది సమంత. వరుణ్ ధావన్ తో పాటు కలిసి నటిస్తోన్న సిటాడెల్ వెబ్ సీరిస్ కోసం ముంబైకెళ్లింది సామ్. ఫ్యామిలీ మ్యాన్ తర్వాత హిందీలో ఆమె నటిస్తున్న మరో సిరీస్ ఇది.

ఇక అక్కడ షెడ్యూల్ పూర్తవగానే గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం ప్రమోషన్లలో బిజీ కానుంది. ఆ తర్వాత శివ నిర్వాణ డైరెక్షన్లో విజయ్ దేవరకొండకు జోడీగా నటిస్తోన్న ఖుషీ షూటింగులో కూడా జాయిన్ కానుంది. వాస్తవానికి ఖుషీ మూవీ అన్నీ అనుకున్నట్టుగా జరిగితే గతేడాది క్రిస్మస్ స్పెషల్ గా రిలీజ్ కావాల్సింది. కానీ సమంత హెల్త్ ఇష్యూ వల్ల షెడ్యూల్ పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది.

Samantha Looking Finish Already Agreed Projects

Samantha Looking Finish Already Agreed Projects

పర్సనల్ లైఫ్ పరంగా, ప్రొఫెషనల్ పరంగా ఎలాంటి ఒడిదుడుకులొచ్చినా సమంత ఏ మాత్రం డౌన్ ఫీలవ్వకుండా ఫేస్ చేస్తూనే వస్తోంది. విడాకుల సమయంలో కూడా ఆ ప్రభావం తన కెరీర్ మీద పడకుండా హ్యాండిల్ చేసింది. సినిమాలు, సిరీసులు, యాడ్స్, షోస్ అంటూ తన డేట్స్ ఖాళీ లేకుండా కష్టపడుతూ వచ్చంది. కానీ సడెన్ గా తనకొచ్చిన హెల్త్ ప్రాబ్లమ్ వల్ల ట్రీట్మెంట్ కోసం ఫారిన్ వెళ్లాల్సి రావడంతో యాక్టింగ్ పరంగా కొన్ని నెలలు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది.

అయినా అలాంటి హార్డ్ సిచ్యుయేషన్సులో కూడా యశోద మూవీ డబ్బింగ్ వర్క్ ఫినిష్ చేసి తన కమిట్మెంట్ ను ప్రూవ్ చేసుకుంది. మరీ మామూలప్పటిలా కాకపోయినా ఆ సమయంలో కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమా కాబట్టి హీరోయిన్ గా తన వంతుగా ప్రమోషన్సులో కూడా పార్టిసిపేట్ చేసింది. కానీ ఆ సినిమా మరీ బ్లాక్ బస్టర్ టాకయితే సాధించలేదు.

అయినా కూడా సమంత ఎప్పటిలాగే డౌన్ అవకుండా బౌన్స్ బ్యాక్ అయి అప్ కమింగ్ ప్రాజెక్టుల మీద ఫోకస్ పెడుతోంది. మరి ఆల్రెడీ ఒప్పుకున్న ప్రాజెక్టులు త్వరగా ఫినిష్ చేసి, మరిన్ని కొత్త స్క్రిప్టులకు ఓకే చెబుతూ సామ్ 2.0 అనిపిస్తుందేమో చూడాలి మరి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us