Samantha : సమంతకి ఏమయ్యింది.? మళ్ళీ ఆసుపత్రిలో చేరిందా.? నిజమేంటి.?

NQ Staff - November 24, 2022 / 03:03 PM IST

Samantha  : సమంతకి ఏమయ్యింది.? మళ్ళీ ఆసుపత్రిలో చేరిందా.? నిజమేంటి.?

Samantha  : సినీ నటి సమంత మళ్ళీ తీవ్ర అస్వస్థతకు గురయ్యిందట. ఆమె హైద్రాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేరిందట. వైద్యులు ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారట. సమంత ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందట.!

సోషల్ మీడియాలోనూ, వెబ్ మీడియాలోనూ ఈ మేరకు పెద్దయెత్తున కథనాలు దర్శనమిస్తున్నాయి. ఇంతకీ, సమంతకి ఏమయ్యింది.? అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోతోంది తమ అభిమాన నటి ఆరోగ్య పరిస్థితిపై.

మయోసైటిస్‌తో బాధపడుతున్న సమంత..

సమంత గత కొంత కాలంగా మయోసైటిస్ అనే అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. ‘ఒక్క అడుగు అయినా ముందుకు వెయ్యగలనా.? అని భయపడ్డాను..’ అంటూ తన అనారోగ్య సమస్య గురించి ‘యశోద’ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో సమంత వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

అనారోగ్య సమస్య కారణంగా బయటకు రాలేక, సమంత ఆ ఇంటర్వ్యూని నాలుగ్గోడల మధ్యనే ఇచ్చింది. సమంత పబ్లిక్ అప్పీయరెన్స్ ఈ మధ్యకాలంలో ఎక్కడా లేదు.

అయితే, సమంత క్రమంగా కోలుకుంటోందనీ, ఆమె ఇప్పుడు ఆసుపత్రిలో చేరలేదనీ, ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఏమీ లేదనీ.. సమంత సన్నిహితుల నుంచి సమాచారం అందుతోంది. ఈ విషయమై సమంత సోషల్ మీడియా వేదికగా అయినా స్పందిస్తే తప్ప.. పుకార్లు ఆగేలా లేవు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us