Samantha Gave Break Shootings : సమంత అంతా బాగానే ఉన్నా ఎందుకు బ్రేక్?
NQ Staff - August 7, 2023 / 07:57 PM IST

Samantha Gave Break Shootings :
స్టార్ హీరోయిన్ సమంత గత ఏడాది మయో సైటిస్ అనే అనారోగ్య సమస్యతో బాధ పడ్డ విషయం తెల్సిందే. ఆమె అనారోగ్య సమస్యతో కనీసం లేచి నిలబడలేని పరిస్థితికి ఆమె చేరింది. ఆ దశ నుండి తిరిగి కోలుకుని మెల్లగా షూటింగ్ లకు హాజరు అయింది. ఖుషి మరియు సిటాడెల్ షూటింగ్స్ ను ఆమె ముగించింది.
మయో సైటిస్ సమస్యతో బాధపడుతున్నా కూడా షూటింగ్స్ హాజరు అయిన సమంత ఇప్పుడు మాత్రం షూటింగ్స్ కు బ్రేక్ తీసుకుంటుంది. ఏడాది పాటు సినిమా షూటింగ్స్ కి హాజరు అవ్వను అంటూ తేల్చి చెప్పిన విషయం తెల్సిందే. హీరోయిన్ గా ఆమె మంచి ఫామ్ లో ఉన్న సమయంలో ఇలాంటి బ్రేక్ ఎంత వరకు కరెక్ట్ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తోంది…
మయోసైటిస్ అంటూ షూటింగ్స్ కు దూరంగా ఉంటున్న సమంత విదేశాల్లో ఎంజాయ్ చేస్తూ ఉంది. అంతే కాకుండా బాలి లో ఈమె తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాలి నుండి తిరిగి వచ్చిన సమంత తన స్నేహితురాలు చిన్మయి ఇంటికి వెళ్లింది.

Samantha Gave Break Shootings
అక్కడ చిన్మయి కవల పిల్లలతో సందడి చేసింది. సమంత ఆ వీడియోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఆ వీడియోల్లో సమంత తెగ సందడి చేసింది. ఇంత బాగానే ఉంది ఎందుకు సమంత బ్రేక్ తీసుకుంది అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇంతకు సమంత ఎప్పుడు షూటింగ్ కి రీ జాయిన్ అవ్వబోతుంది అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
Always a Child ????????
Our Cutie @Samanthaprabhu2 with @Chinmayi & @23_rahulr kids ❤️????#Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/itrPdoB1H7— SAM ARMY || KnowUrStarSAM™ (@KnowUrStarSAM) August 6, 2023