Samantha Business New Update : ఓ పక్క అనారోగ్యం.. అయినా వ్యాపారం వదలని సమంత.. ఏం చేసిందంటే..!
NQ Staff - July 15, 2023 / 10:32 AM IST

Samantha Business New Update :
సమంత ఇప్పుడు మళ్లీ ఫ్యాన్స్ కు షాక్ ఇస్తోంది. మయో సైటిస్ వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత ఏడాది కాలంగా వరుసగా షూటింగులు చేసింది. సినిమాలను కంప్లీట్ చేసింది. ఇక ఆమెకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు అనుకుంటున్న సమయంలో మళ్లీ అనారోగ్యానికి గురైంది అందకే ఒప్పుకున్న సినిమాలను కూడా వదిలేసింది.
ఏడాది దాకా ఎలాంటి సినిమాలు చేయబోనంటూ ప్రకటించింది. ఈ సమయంలో ఆమె అమెరికా వెళ్లి ట్రీట్ మెంట్ తీసుకోవాలని డిసైడ్ అయింది. కాగా ఇలా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నా సరే తన వ్యాపారాన్ని మాత్రం వదలట్లేదు. ఆమెకు సాకీ పేరుతో గార్మెంట్స్ బ్రాండ్ ఉంది.
వారికి సాయం చేయడం కోసమే..
ఈ కంపెనీలో ఉమెన్స్ వేర్ లభిస్తాయి. ఈ బ్రాండ్ బట్టలు, వస్తువులను ఆమె చాలా కాలంగా ప్రమోట్ చేస్తోంది. ఇక ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నా సరే వాటిని ప్రమోట్ చేసింది. సోషల్ మీడియాలో ఈ మేరకు ఓ పోస్టు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఈ సంస్థ ద్వారా వచ్చే లాభాలు సమంత చారిటీస్, సోషల్ వర్క్ కోసం ఖర్చు చేస్తోంది సమంత.
ఆమె అనారోగ్యంతో ఉన్నా సరే సంస్థ కోసం చేస్తున్న పనిని అందరూ అభినందిస్తున్నారు. ఏదేమైనా సమంత త్వరగా కోలుకుని మళ్లీ సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నారు ఆమె అభిమానులు.