Salaar Story New Update : సలార్ స్టోరీ ఇదే.. యూఎస్ ఆర్మీతో యుద్ధం.. ఊహకందని ట్విస్టులు..!

NQ Staff - July 8, 2023 / 10:02 AM IST

Salaar Story New Update : సలార్ స్టోరీ ఇదే.. యూఎస్ ఆర్మీతో యుద్ధం.. ఊహకందని ట్విస్టులు..!

Salaar Story New Update :

గత కొన్ని రోజులుగా సలార్ గురించే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా ప్లాపులను చవిచూశాడు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్‌ వరుసగా అట్టర్ ప్లాప్ అయ్యాయి. దాంతో వీటన్నింటికీ సమాధానం చెప్పే సినిమానే సలార్ అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే టీజర్ లో సలార్ కథను కొందరు కనిపెట్టేశారు.

దాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు. సలార్ కథ మొత్తం సున్నపురాయి గురించే జరుగుతుందంట. ఈ సున్నపురాయి ఫార్మాకు, యూఎస్ ఆర్మీకి లింక్ ఉంటుంది. ఈ నేపత్యంలోనే హీరో ప్రభాస్ యూఎస్ ఆర్మీతో పోరాడుతాడని తెలుస్తోంది. వీరిద్దరి మధ్య జరిగే యుద్ధం ప్రపంచ యుద్ధాన్ని తలపించేలా ఉంటుందని చెబుతున్నారు.

కేజీఎఫ్‌-2 లింకులు..

ఊహకందని యాక్షన్ సీన్లు కూడా భారీగానే పెట్టేశాడంట ప్రశాంత్ నీల్. అంతే కాకుండా కేజీఎఫ్‌-2తో లింక్ కూడా ఉంటుందని.. అది భారీ ట్విస్ట్ ద్వారా బయట పెట్టబోతున్నారంట. ఈ కథ మొత్తం కేజీఎఫ్‌ కు కంటిన్యూగా 1980లోనే జరుగుతుందంట. ఇక టీజర్ లో ఇప్పటికే కేజీఎఫ్‌-2 లింకులు బయటపడ్డాయి. ఆ కలర్, ఆ టోన్డ్, కొన్ని వస్తువులు, లొకేషన్లు ఇలా అన్నీ కేజీఎఫ్‌ కు లింక్ ఉన్నట్టే తెలుస్తోంది. మొత్తానికి ఇది ఊహకందని కథ అని చెబుతున్నారు.

ఈ మూవీ రెండు భాగాలుగా రాబోతోంది. రెండో పార్టులో కేజీఎఫ్‌-2 కు సంబంధించిన పూర్తి లింకులు బయట పడుతాయంట. ఈ సలార్ మూవీ ప్రశాంత్ నీల్ యూనివర్స్ లోకి వస్తుందని అంటున్నారు. ఇలా రకరకాల మలుపులతో మూవీ మొత్తం కేజీఎఫ్ తో ముడిపడి ఉంటుందని చెబుతున్నారు. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ.. ఎదురు చూడాల్సిందే.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us