Salaar Movie : సలార్ మూవీ నుంచి క్రేజీ అప్ డేట్.. ఫ్యాన్స్ కు పండగే..!
NQ Staff - May 15, 2023 / 09:40 AM IST

Salaar Movie : ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన ఎంటైర్ కెరీర్ లో ఒకేసారి ఇన్ని సినిమాలు చేయడం కూడా ఇదే మొదటిసారి కావొచ్చు. పైగా అన్ని పెద్ద ప్రాజెక్టులే కావడం ఇక్కడ ఇంకో విశేషం. ప్రస్తుం ఆయన ఆదిపురుష్, సలార్, ప్రాజెక్టు కే, స్పిరిట్ లాంటి సినిమాల్లో నటిస్తున్నారు.
రీసెంట్ గానే ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. వచ్చే నెల 16న మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమాపై ఓ రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్లు ఉన్నాయి. ఈ మూవీని సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తామని గతంలోనే మూవీ టీమ్ ప్రకటించింది.
కానీ ఇప్పుడు కొన్ని రూమర్లు పుట్టుకొస్తున్నాయి. సలార్ షూటింగ్ ఆలస్యం అవుతోందని, కాబట్టి అనుకున్న టైమ్ కు రిలీజ్ చేయలేకపోవచ్చంటూ కొందరు న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా దీనిపై తాజాగా మూవీ టీమ్ క్రేజీ అప్ డేట్ ఇచ్చింది.
ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 28న మూవీని రిలీజ్ చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుందని కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదంటూ తెలిపారు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. ప్రభాస్ సృష్టించే మాస్ ఫీస్ట్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు.