Sajjnar: మ‌హిళ‌ల స‌మ‌స్య‌పై స‌జ్జ‌నార్‌కి ట్వీట్ చేసిన యువ‌తి.. తన‌దైన శైలిలో బ‌దులిచ్చిన టీఎస్ఆర్టీసీ ఎండీ

Sajjnar: పోలీస్ డ్రెస్ వేసుకున్న‌ప్పుడు నేర‌గాళ్ల‌కు వ‌ణుకు పుట్టించిన స‌జ్జ‌నార్ .. తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వినూత్న నిర్ణయాలతో ముందుకు దూసుకుపోతున్నారు. ఆయ‌న నిర్ణ‌యాల‌పై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్తం అవుతుంది. ఎప్పుడు లేని విధంగా ఈ సారి సంక్రాంతి స్పెష‌ల్ బ‌స్సుల‌కు ఎలాంటి ఎక్స్‌ట్రా ఛార్జీలు వ‌సూలు చేయ‌కుండా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

sajjanar stuuning reply to netizens
sajjanar stuuning reply to netizens

ప్రయాణీకులకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారికి ఎ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తూ.. తనదైన శైలిలో వాటిని పరిష్కరిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా అర్ధరాత్రి టీఎస్ఆర్టీసీకి ఓ యువతి చేసిన ట్వీట్ పై వెంటనే ఆర్టీసీఎండీ సజ్జనార్ స్పందించారు.

అర్ధరాత్రి సమయాలలో ఆర్‌టీసీ బస్సులలో మహిళల సౌకర్యం కోసం ( వాష్ రూమ్స్ ) బస్సులను పెట్రోల్ పంప్ లలో 10 నిమిషాలు బస్సు ఆపాలని కోరిన యువతి పాలే నిషా కోరారు. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ఆ యువతి చెప్పారు.

దీంతో వెంటనే ఈ విషయం పై అధికారులకు సూచించినట్లు సజ్జనార్ రిప్లై ఇచ్చారు. అర్ధరాత్రి సైతం మహిళ సమస్యపై సజ్జనార్ స్పందించడంతో పాలే నిషా ఆనందం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపింది. నిషాతో పాటు నెటిజన్లు సైతం సజ్జనార్‌ స్పందించిన తీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

sajjanar stuuning reply to netizens
sajjanar stuuning reply to netizens

తెలంగాణ ఆర్టీసీ సంస్థ ఉన్నతి కోసం వినూత్న నిర్ణయాలతో ముందుకెళ్తున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో అంతే చురుగ్గా ఉంటూ..ఆర్టీసీ ఉన్నతికోసం ప్రజలు సహకరించాలని కోరారు. ఆర్టీసీ ఆదాయం పెంచడంతోపాటు ప్రయాణికుల సౌకర్యాలపై దృష్టి సారించారు స‌జ్జ‌నార్.