Sajjanar: నారప్ప‌పై మీమ్ క్రియేట్ చేసిన స‌జ్జ‌నార్..ఫొటో హ‌ల్ చ‌ల్

Sajjanar: పోలీస్ అధికారులు ప్ర‌జ‌ల‌లో అవాగాహ‌న క‌ల్పించేందుకు అన్ని అస్త్రాల‌ని వాడుతున్నారు. ముఖ్యంగా సోష‌ల్ మీడియాని ఎంచుకొని వారు షేర్ చేస్తున్న మీమ్స్ నెటిజ‌న్స్‌కి థ్రిల్ క‌లిగిస్తున్నాయి. డ్రైవింగ్‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతో పాటు క‌రోనా జాగ్ర‌త్త‌లు తెలియ‌జేస్తున్నారు. ఇటీవ‌ల ఆర్ఆర్ఆర్ పోస్ట‌ర్ విడుద‌ల కాగా, బైక్‌పై ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌లు హెల్మెట్ లేకుండా ప్ర‌యాణిస్తున్నారు.

ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ కాగా, దీనిని హైద‌రాబాద్ పోలీస్‌లు ఎడిట్ చేసి షేర్ చేశారు. తార‌క్, రామ్ చ‌ర‌ణ్‌ల‌కు హెల్మెట్ త‌గిలించి బైక్‌పై ప్ర‌యాణించేట‌ప్పుడు హెల్మెట్ త‌ప్ప‌నిస‌రి అని పేర్కొన్నారు. ఇక తాజాగా సీపీ స‌జ్జ‌నార్ నార‌ప్ప సినిమాకు సంబంధించి మీమ్ క్రియేట్ చేశాడు. ఈ మీమ్ నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.

ప్ర‌స్తుతం క‌రోనా విజృంబిస్తున్న వేళ ప్ర‌తి ఒక్క‌రు మాస్క్ త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది. పోలీసులు, ప్ర‌భుత్వాలు దీనిపై అవ‌గాహ‌న క‌ల్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో నార‌ప్ప సినిమాలో వెంక‌టేష్ ముఖానికి మాస్క్ త‌గిలించి క‌రోనా ఇంకా ముగిసిపోలేదు. బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు మాస్క్ త‌ప్ప‌నిస‌రిగా పెట్టుకోవాలి అని స‌జ్జ‌నార్ స్ప‌ష్టం చేశారు. క‌రోనాపై అవ‌గాహ‌న క‌ల్పించే ప్ర‌య‌త్నంలో స‌జ్జ‌నార్ షేర్ చేసిన ఫొటో వైర‌ల్ అవుతుంది.

విక్టరీ వెంకటేష్ నటించిన నారప్ప సినిమా ఇటీవల భారీ స్థాయిలో విడుదలైన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా వెంకీ సినిమా థియేట్రికల్ గా కాకుండా ఓటీటీలో విడుదలవ్వడం అభిమానులను కాస్త అప్సెట్ చేసింది. అయితే ఒక విధంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీలోనే విడుదల చేయడం మంచిది అని చిత్ర యూనిట్ ఆలోచించింది. అమెజాన్ ప్రైమ్ కూడా లాభాలు వచ్చే విధంగానే మంచి డీల్ ను ఆఫర్ చేసింది .