Saindhav Movie : ఫస్ట్ లుక్ తోనే ఆ పేరుతో విమర్శలు ఎదుర్కొంటున్న వెంకీ75 చిత్రం
NQ Staff - January 26, 2023 / 07:24 PM IST

Saindhav Movie : వెంకటేష్ 75వ సినిమా ‘హిట్’ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రారంభమైన విషయం తెలిసిందే. సైంధవ్ అనే టైటిల్ తో రూపొందబోతున్న ఈ సినిమా కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు చిన్న వీడియోని విడుదల చేయడం జరిగింది.
తాజాగా సినిమా యొక్క పూజా కార్యక్రమాలు భారీ ఎత్తున నిర్వహించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ చూసిన తర్వాత చాలా మంది ఇది గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా ని గుర్తుకు తెస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఫస్ట్ లుక్ లో కమల్ హాసన్ ని ఎలా అయితే విక్రమ్ సినిమాలో చూసామో ఇప్పుడు అలాగే ఈ సినిమాలో వెంకటేష్ కనిపిస్తున్నాడని కొందరు కామెంట్ చేస్తున్నారు. వెంకటేష్ 75వ సినిమా మొదటి రోజే ఇలాంటి విమర్శలు ఎదుర్కోవడంతో ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Saindhav Movie First Look Poster Released
దర్శకుడు శైలేష్ కొలను మాత్రం విక్రమ్ సినిమాకు ఈ సినిమాకు అసలు సంబంధం లేదని అంటున్నాడు. అలాగే కచ్చితంగా ఇది ఒక కొత్త విభిన్నమైన యాక్షన్ త్రిల్లర్ అంటూ హామీ ఇస్తున్నాడు. కొన్ని యాక్షన్ త్రిల్లర్ సినిమాలు చూడ్డానికి పోస్టర్స్ లో ఒకే విధంగా ఉంటాయి.. కానీ సినిమా థియేటర్లోకి వెళితే సరికొత్త అనుభూతినిస్తాయని దర్శకుడు హామీ ఇస్తున్నాడు.