Sai Pallavi : నా వల్ల నిర్మాతలు అప్పుల్లో కూరుకుంటున్నారు.. సాయిపల్లవి ఎమోషనల్..!
NQ Staff - May 31, 2023 / 10:14 AM IST
Sai Pallavi : నేచురల్ బ్యూటీ సాయిపల్లవి గురించి అందరికీ బాగా తెలుసు. ఆమెకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఎలాంటి గ్లామర్ ఎక్స్ పోజింగ్ చేయకుండా ఇంత క్రేజ్ ను సంపాదించుకోవడం అంటే మాటలు కాదు. కానీ అది కేవలం సాయిపల్లవికి మాత్రమే సాధ్యం అయిపోయిందని చెప్పుకోవాలి.
ఇక సాయిపల్లవి ఇప్పటి వరకు స్టార్ హీరోల సినిమాల్లో పెద్దగా నటించలేదు. అంటే అవకాశాలు రాలేదని కాదు.. ఆ సినిమాల్లో తన పాత్ర నచ్చకపోవడంతో స్టార్ హీరోల సినిమాలు కూడా ఆమె క్యాన్సిల్ చేసుకుంది. దీన్ని బట్టి చెప్పుకోవచ్చు ఆమెకు స్టార్ ఇమేజ్ కన్నా కూడా తనకు నచ్చిన పాత్ర చేయడం అంటేనే ఇష్టం అని.
అయితే ఆమె కొన్ని రోజులుగా సినిమాల్లో కనిపించట్లేదు. ఆమె చివరగా నటించిన మూవీ గార్గి. దీని తర్వాత ఆమె మరో సినిమాకు కమిట్ అవ్వలేదు. ఆమె చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమాల వల్ల ప్లాపులు చవి చూసింది. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన సినిమాలపై క్లారిటీ ఇచ్చింది.
సినిమా అనేది నిర్మాతలను కాపాడేది కావాలి. అంతే గానీ నా వల్ల కొందరు అప్పుల పాలు అవుతున్నారు. అది నాకు ఇష్టం లేదు. కానీ వారు నాతో మళ్లీ సినిమా చేయడానికి రెడీగా ఉంటున్నారు. కానీ వారిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. లేదీ ఓరియెంటెడ్ సినిమాలు కాకుండా వేరే మంచి సినిమాల్లో ఛాన్స్ వస్తే కచ్చితంగా నటిస్తా అంటూ చెప్పింది సాయిపల్లవి.