రియల్ హీరో అనిపించుకున్న మెగా హీరో సాయిధరమ్ తేజ్

Advertisement

మెగా హీరో ఇచ్చిన మాటను నిలబెట్టుకొని రియల్ హీరో అనిపించుకున్నాడు. వివరాల్లోకి వెళితే విజయవాడలోని అమ్మ ప్రేమ ఆదరణ సేవ వృద్ధాశ్రమాన్ని తన టీం సహాయంతో నిర్మించాడు మెగా యువ హీరో సాయి ధరమ్ తేజ్. అంతే కాకుండా ఒక సంవత్సరం పాటు దానికి అవసరమయ్యే ఖర్చులను తీరుస్తానని హామీ ఇచ్చాడు. అయితే 2019లో తన పుట్టినరోజు సందర్భంగా సాయితేజ్ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను విడుదల చేశాడు.

విజయవాడలోని ఓ వృద్ధాశ్రమం నిర్వాహకులు తనను సంప్రదించారని, అసంపూర్తిగా ఉన్న తమ బిల్డింగ్ నిర్మాణానికి సాయం చేయాలనీ కోరారని తెలిపాడు. ఇక దానికి తాను ఒప్పుకున్ననాని, అలాగే మెగా ఫ్యాన్స్ కూడా వాళ్లకు తోచిన విధంగా సాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. సాయి ధరమ్ తేజ్ పిలుపు మేరకు మెగా ఫ్యాన్స్ లక్ష రూపాయలు సాయం చేశారు. ఇక తాను ఇచ్చిన మాటకు కట్టుబడి సాయితేజ్ ఆ బిల్డింగ్ నిర్మాణానికి చేయూత నిచ్చాడు. మాట నిలుపుకున్న మెగా హీరోకు తెగ ప్రశంసలు వస్తున్నాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here