Sai Dharam Tej Responded Pawan Kalyan Three Marriage Comments : ప్యాకేజ్ స్టార్, మూడు పెళ్లిళ్ల కామెంట్లపై సాయిధరమ్ తేజ్ కౌంటర్లు.. ఇలా అన్నాడేంటి..!

NQ Staff - July 30, 2023 / 10:41 AM IST

Sai Dharam Tej Responded Pawan Kalyan Three Marriage Comments : ప్యాకేజ్ స్టార్, మూడు పెళ్లిళ్ల కామెంట్లపై సాయిధరమ్ తేజ్ కౌంటర్లు.. ఇలా అన్నాడేంటి..!

Sai Dharam Tej Responded Pawan Kalyan Three Marriage Comments :

పవన్ కల్యాణ్‌ ను రాజకీయాల్లో అవతలి వారు ఎక్కువగా విమర్శించేవి మూడు పెళ్లిళ్లు, ప్యాకేజ్ స్టార్. ఇవి ఎక్కువగా ఆయన మీద వస్తున్న ఆరోపణలు. గతంలో ఆయన వీటి మీద పెద్దగా స్పందించేవారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ప్రతి మాటకు సమాధానం ఇస్తున్నారు పవన్.

అయితే పవన్ ను ఇన్ని మాటలు అంటుంటే అటు మెగా ఫ్యామిలీ గానీ.. ఇటు అల్లు ఫ్యామిలీ హీరోలు గానీ ఎందుకు స్పందించరు అనే ప్రశ్న జనసైనికుల్లో ఉంటుంది. వారు అప్పుడప్పుడు దీనిపై బాధపడుతూ ఉంటారు. అయితే తాజాగా బ్రో సినిమా రిలీజ్ సందర్భంగా ప్రమోషన్లు చేస్తున్నారు సాయితేజ్.

రియాక్ట్ కావొద్దంటూ..

ఈ సందర్భంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో సాయితేజ్ దీనిపై స్పందించాడు. మావయ్య ఓ రోజు నన్ను, చరణ్‌, వైష్ణవ్, వరుణ్ లను పిలిచాడు. నేను పాలిటిక్స్ లోకి వెళ్తున్నాను. నన్ను చాలామంది తిడుతుంటారు. దానికి మీరు రియాక్ట్ కావొద్దు. ఒకవేళ రియాక్ట్ కావాలనుకుంటే పూర్తిగా తెలుసుకుని రాజకీయాల్లోకి రండి.

మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఉంటుందని తెలుసు. కానీ మీరు నా గురించి ఏమీ మాట్లాడకండి ఈ విషయంలో నన్ను మన్నించండి అన్నారు. అదేంటి మావయ్య మేం మిమ్మల్ని మన్నించడం ఏంటి అంటూ అన్నాం.

దానికి ఆయన ఒకటే చెప్పాడు. నన్ను ఎవరైనా ఏమైనా అంటే మీరు రియాక్ట్ అవుతారని నాకు తెలుసు. కానీ మీ కెరీర్ ను పాడు చేసుకోకండి. అందుకే మీరు సైలెంట్ గా ఉండండి అంటూ చెప్పారు. అందుకే ఆయన విషయంలో మేం లోలోపల బాధపడుతూనే ఉంటాం అంటూ తెలిపాడు సాయితేజ్.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us