Sai dharam Tej : ఒకప్పుడు నా పేరు కూడా మీకు తెలియదు: సాయిధరమ్ తేజ్ షాకింగ్ కామెంట్.!
NQ Staff - December 3, 2022 / 11:57 AM IST

Sai dharam Tej : అసలు సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు.? ఈ విషయమై చాలామందికి చాలా అనుమానాలున్నాయి. యాక్సిడెంట్ తర్వాత పబ్లిక్ అప్పీయరెన్స్ బాగా తగ్గించేశాడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్.
మెగా మేనల్లుడిగా సాయి ధరమ్ తేజ్ తెరంగేట్రం చేశాడు. కొన్ని మంచి విజయాల్ని కూడా అందుకున్నాడు. కొన్నాళ్ళ క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కోలుకోవడానికి చాలా సమయమే పట్టింది. ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఇంకో సినిమా పట్టాలెక్కించాడు ఈ మెగా మేనల్లుడు.
పేరు కూడా తెలియని దర్శకులతో సినిమాలెందుకు.?
ఓ నెటిజన్.. నిజానికి, సాయిధరమ్ తేజ్ అభిమానే అతడు.. సోషల్ మీడియా వేదికగా తన అభిమాన హీరోని ఉద్దేశించి ఓ ప్రశ్న వేశాడు. ‘కొంచెం పేరు తెలిసిన దర్శకుల్ని సెలక్ట్ చేసుకో అన్నా..’ అంటూ ఓ సూచన చేశాడు సదరు అభిమాని సాయి ధరమ్ తేజ్‌కి.
అయితే, దానికి సాయి ధరమ్ తేజ్ హుందాగా స్పందించాడు. ‘ఒకప్పుడు నా పేరు కూడా తెలియదు మీకు. అతని పేరు జయంత్. ఈ పేరుని గుర్తు పెట్టుకోండి ప్లీజ్..’ అంటూ తన తాజా చిత్ర దర్శకుడి గురించి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు సాయి ధరమ్ తేజ్.
కొత్త దర్శకులతో సినిమాలంటే.. కొత్త కథలు వస్తాయ్. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్న హీరోల్ని అభినందించాల్సిందే.
#SDT16: Sai Dharam Tej’s 16th film launched today. Jayanth, debutant director will direct the movie. pic.twitter.com/LLH8KWGmDi
— Aakashavaani (@TheAakashavaani) December 2, 2022