Sai Dharam Tej : డాక్టర్ తో సాయిధరమ్ తేజ్ పెళ్లి.. మెగా ఫ్యామిలీ కీలక నిర్ణయం..?
NQ Staff - June 17, 2023 / 11:04 AM IST

Sai Dharam Tej : మెగా హీరోలు వరుసగా పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే వరుణ్ తేజ్ తను ప్రేమించిన లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. మొన్ననే గ్రాండ్ గా మెగా ఫ్యామిలీ సమక్షంలో ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సాయిధరమ్ తేజ్ వంతు వచ్చినట్టు తెలుస్తోంది.
అవునండి బాబు.. వరుణ్ పెళ్లి అయిన వెంటనే సాయిధరమ్ తేజ్ తల్లి విజయదుర్గ కూడా సాయికి పెళ్లి చేయాలని డిసైడ్ అయిందంట ఆమె రీసెంట్ గానే ఓ డాక్టర్ ను రెండో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు తన కొడుకుకి మంచి అమ్మాయితో పెళ్లి చేయాలని సంబంధాలు చూడటం స్టార్ట్ చేసింది.
కాగా ఆమె రెండో భర్త స్నేహితుడి కూతురు కూడా డాక్టర్ అని.. ఆమెతో సాయి ధరమ్ తేజ్ పెళ్లి చేయాలని విజయదుర్గ భావిస్తోందంట. అమ్మాయి సంబంధం తమ వారే కావడంతో పాటు ఆర్థికంగా బాగా ఉన్నవారే కావడంతో ఆ సంబంధమే బాగుంటుందని విజయదుర్గ ఆలోచిస్తున్నారంట.
ఇదే విషయాన్ని ఇప్పటికే చిరంజీవి వద్ద కూడా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. సాయిధరమ్ తేజ్ వయసు ఇప్పుడు 36 ఏళ్లు. ఇంకా వయసు ముదరక ముందే పెళ్లి చేయాలని ఆమె చూస్తోంది. ఇరు కుటుంబాల నడుమ ఇప్పుడు చర్చలు నడుస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందంట.