Sai Dharam Tej: సాయి తేజ్ బైక్ యాక్సిడెంట్‌.. ల‌క్ష రూపాయ‌లు జ‌రిమానా వేసిన జీహెచ్ఎంసీ

Sai Dharam Tej: మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ సెప్టెంబ‌ర్ 10 రాత్రి స్పోర్ట్స్‌ బైక్‌పై ప్రయాణిస్తుండ‌గా, ఆయ‌న ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయన తీవ్రగాయాలు అయ్యాయి. నగరంలోని కేబుల్‌ బ్రిడ్జ్‌-ఐకియా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మెడికవర్‌లో ప్రాథమికి చికిత్స అనంతరం ఆయన్ను అపోలో ఆసుపత్రికి తరలించారు.

సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వెంటిలేటర్‌ అవసరం క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతానికి ఐసీయూలోనే అతడికి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన చికత్సకు స్పందిస్తున్నారు. సాయి తేజ్‌ మెల్లి మెల్లిగా కోలుకుంటున్నారు. నిన్న ఆయన కాలర్‌ బోన్‌కు చేసిన ఆపరేషన్‌ విజయంతం అయ్యింది.

సాయి తేజ్ కింద ప‌డిపోవ‌డానికి కార‌ణం రోడ్డు పైన ఉన్న ఇసుక అనే చాలా మంది అంటున్నారు. ఇసుక వ‌ల‌న బైక్ స్కిడ్ అయింద‌ని, అందుకే తేజ్‌కి అంత పెద్ద ప్ర‌మాదం జ‌రిగింద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. రోడ్ల మీద వ్యర్థాలను వేస్తున్న వారి పై కొరడా ఝుళిపిస్తుంది.

మాదాపూర్ ఖానామెట్ లో భవననిర్మాణం చేపడుతున్న అరబిందో కన్స్రక్షన్ కంపెనీ కీ లక్ష రూపాయల జరిమాన విధించారు జీహెచ్ఎంసీ చందానగర సర్కిల్ అధికారులు. వారు చేప‌డుతున్న క‌న్‌స్ట్ర‌క్ష‌న్ వ‌ల్ల‌నే రోడ్డుపైకి ఇసుకు వ‌చ్చింద‌ని, అందుకే వారికి జ‌రిమానా విధించిన‌ట్టు స‌మాచారం.

రోడ్డు సరిగ్గా లేనందున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అంతేకానీ సాయి ఓవర్‌ స్పీడ్‌ వల్లకాదు. అతను ఎటువంటి నియ‌మాల‌ను అతిక్ర‌మించ‌లేదు, ఆ టైమ్‌లో సాయి తేజ్ హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు. యాక్సిడెంట్‌ అనేది ఎవరికైనా జరగొచ్చు. కాబట్టి అతడికి, అతడి కుటుంబ ప్రైవసీకి భంగం కలిగించకండి అంటూ కొంద‌రు తేజ్‌కి స‌పోర్ట్‌గా నిలుస్తున్నారు.