Sadhguru: సద్గురు సేవ్ సాయిల్.! గంగవ్వకి మాత్రమే ఆ అర్హత వుందేమో.!

NQ Staff - June 17, 2022 / 08:20 AM IST

Sadhguru: సద్గురు సేవ్ సాయిల్.! గంగవ్వకి మాత్రమే ఆ అర్హత వుందేమో.!

Sadhguru: గంగవ్వ.. మట్టి మనిషి. కాంక్రీట్ జంగిల్‌లో ఇమడలేకపోయింది. అలాంటి ఆమెను ఓ ఇంట్లో బంధించేస్తే కుదురుతుందా.? విన్నర్ అయ్యేదే.. కానీ, బిగ్ బాస్ ఇంట్లో ఆమె ప్రయాణం అర్థాంతరంగా ముగిసింది. నాగార్జున ఎంతలా నచ్చజెప్పినా, తోటి కంెటస్టెంట్లు ఎంత బాగా చూసుకున్నా, మట్టి వాసన చూడనిదే, తనకు పొద్దు తిరగడం కష్టమని గగ్గోలు పెట్టింది గంగవ్వ.

Sadhguru Save Soil Concept will only applicable to Gangavva

Sadhguru Save Soil Concept will only applicable to Gangavva

అలాంటి గంగవ్వని సద్గురు జగ్గీ వాసుదేవ్ కలిశారు. వీరిద్దరి కలయిక చాలా చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. ‘సేవ్ సాయిల్’ పేరుతో మట్టి ప్రాముఖ్యతను తెలియజేస్తూ సద్గురు జగ్గీ వాసుదేవ్ ఓ గొప్ప యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన హైద్రాబాద్ వచ్చారు.

గంగవ్వ మట్టి ముచ్చట.!

ఈ సందర్భంలోనే గంగవ్వ, జగ్గీ వాసుదేవ్ కలయిక చోటు చేసుకుంది. ‘మట్టి ముచ్చట..’ అంటూ గంగవ్వ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. ‘మై విలేజ్ షో’లో గంగవ్వ ఈ ‘సేవ్ సాయిల్’ గురించీ, జగ్గీ వాసుదేవ్ గురించీ ఏం చెప్పబోతోందోగానీ, ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

గంగవ్వని మట్టిలో మాణిక్యంగా ఎందుకు అభివర్ణిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూ ట్యూబ్ ఆమె జీవితాన్ని మార్చేసింది. పేరు ప్రఖ్యాతులు సంపాదించినా, ఆ మట్టికే అంకితమవుతానంటోంది గంగవ్వ. పొద్దున్న లేస్తే, ఆ మట్టితోనే తన సావాసం అని చెప్పడం గంగవ్వకే చెల్లింది.

సినిమాల్లో నటిస్తున్నా, యూ ట్యూబ్ వీడియోలు చేస్తున్నా.. పల్లెటూరిలో వున్న ఆనందం ఇంకెక్కడా తనకు వుండదని చెబుతుంటుంది గంగవ్వ.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us