పవన్ జన్మదిన వేడుకల్లో అపశ్రుతి

Advertisement

నటుడు, జనసేన అధినేత జన్మదిన వేడుకల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఏపీలోని చిత్తూరు జిల్లా శాంతిపురంలో పవన్ ఫ్లెక్సీ లు కడుతుండగా కరెంట్ షాక్ తగిలి ముగ్గురు పవన్ అభిమానులు మృతి చెందారు. అలాగే మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే మృతులు కడపల్లెకు చెందిన రాజేంద్ర (31), సోమశేఖర్‌ (29), అరుణాచలం (20)గా గుర్తించారు.

ఇక ఈ ఘటన పై పవన్ స్పందించాడు. గుండెల నిండా నా పై అభిమానం పెంచుకున్న ముగ్గురు యువకులు విద్యుత్ షాక్‌తో మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పవన్ అన్నారు. అలాగే వారి తల్లిదండ్రుల గర్భ శోకాన్ని అర్ధం చేసుకోగలనన్నడు.ఇక ఆ తల్లిదండ్రులకు ఇకపై తానే బిడ్డగా అండగా నిలుస్తానని తెలిపారు. ఆర్థికంగా ఆ కుటుంబాలను నేనే ఆదుకుంటానని పవన్ కల్యాణ్ వెల్లడించాడు. అలాగే గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకుంటానని అన్నాడు. అందరికి కూడా సాయం అందేలా చూడాలని స్థానిక నాయకులను కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here