Sachin : ఆల్‌రౌండ‌ర్ ప్ర‌తిభ చూపించిన శున‌కం.. ఫిదా అయిన స‌చిన్

Sachin : మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ క్రికెట్‌లో ఎన్ని అద్భుతాలు సృష్టించాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ తీసుకున్నాక సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా మారిపోయాడు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌. తన వ్యక్తిగత విషయాలతో పాటు సమాజంలోని పలు విషయాలపై తన అభిప్రాయలను పంచుకుంటున్నాడు.

TheNewsQube-
Sachin share viral video of dog playing cricket
Sachin share viral video of dog playing cricket

తాజాగా స‌చిన్ షేర్ చేసిన వీడియోలో ఓ శునకం పిల్లలతో క్రికెట్ ఆడడం కనిపిస్తుంది. అంతేకాదు, ఇంకా ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ఆ శునకం డబుల్ రోల్ పోషిస్తుండడం. ఫీల్డింగ్, కీపింగ్ బాధ్యతలు చూసుకుంటూ పిల్లలకు ఎంతగానో సాయపడుతోంది. ఇద్దరు పిల్లలు క్రికెట్‌ ఆడుతుండగా ఓ కుక్క వారికి సాయం చేస్తుంది.

ఫీల్డర్‌గా బంతిని అందుకోవడంతో పాటు కీపర్‌గా వికెట్ల వెనకాల నిలబడుతుంది. ఆతర్వాత బంతిని నోట కరుచుకుని బౌలర్‌కు అందజేస్తుంది.ఇలా ఆల్‌రౌండ్‌ పనులు చేసిన శునకం నైపుణ్యాలకు ముగ్ధుడైన సచిన్‌ ఆ వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ. ‘ ఓ ఫ్రెండ్‌ ద్వారా ఈ వీడియో నా దగ్గరకు వచ్చింది.

క్రికెట్‌లో మనం వికెట్‌ కీపర్లు, ఫీల్డర్లు, ఆల్‌రౌండర్లను చూసి ఉంటాం. కానీ ఈ శునకం చేస్తున్న పనులకు మీరేం పేరు పెడతారు’ అని క్యాప్షన్‌ రాసుకొచ్చాడు. సచిన్‌ పోస్ట్‌ చేసిన వీడియో క్రికెట్‌ అభిమానులతో పాటు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ‘వావ్‌’, ‘క్యూట్‌’, ‘టామీ రోడ్స్‌’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇది చూస్తుంటే లగాన్ సినిమా గుర్తొస్తోందని కొందరంటే.. బాల్య స్మృతులు గుర్తొస్తున్నాయని పేర్కొన్నారు. మరికొందరు ఆ శునకాన్ని ‘లెజెండ్’ అని కీర్తించారు.