విషమంగా ఉన్న ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం

Advertisement

ప్రముఖ లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా బారిన పడి చెన్నై లోని ఎంజిఎం ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తన ఆరోగ్యం పై ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు మరోసారి హెల్త్ బులిటెన్ విడుదల చేసారు. అయితే ప్రస్తుతం ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. అలాగే ఇప్పటికీ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ తొ ఐసీయూలోనే చికిత్స కొనసాగిస్తున్నామని తెలిపారు. అలాగే ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో ఆయనకు చికిత్స జరుగుతుందని వెల్లడించారు. తన తండ్రి అందరి ఆకాంక్షలతో త్వరగా కోలుకుంటారని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ తెలిపారు. ఇంతలోనే వైద్యులు తన పరిస్థితి విషమంగా ఉందని చెప్పడం తో అభిమానులు అందరు కూడా ఆందోళన చెందుతున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here