కరోనా భారిన పడ్డ RX100 దర్శకుడు అజయ్ భూపతి

Advertisement

హైదరాబాద్: దేశంలో ఇప్పటికే చాలామంది ప్రముఖులు కరోనా భారిన పడ్డారు. వారిలో సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. కొన్ని రోజుల క్రితం అమితాబ్ ఫ్యామిలీ సోకగా, వాళ్ళకు ఇప్పుడు కరోనా నెగటివ్ రావడంతో ఇంటికి వెళ్లిపోయారు. కరోనా సోకిన రాజమౌళి కూడా నిన్న టెస్టులు చేయించుకోగా నెగటివ్ వచ్చింది. అయితే ఇప్పుడు తాజా నూతన దర్శకుడు, RX100 చిత్రంతో ఒక ట్రెండ్ సెట్ చేసిన అజయ్ భూపతి కూడా కరోనా భారిన పడ్డారు .

తనకు కరోనా సోకిందని, త్వరలోనే కరోనాను జయించి, ప్లాస్మా డొనేట్ చేస్తానని ట్విట్టర్ లో వెల్లడించారు. ప్రజలు కరోనా భారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అజయ్ సూచించారు. అజయ్ త్వరగా కరోనాను జయిస్తాడని పలువురు ప్రముఖులు ట్వీట్ చేశారు. అజయ్ భూపతి తన తదుపరి చిత్రంలో రవితేజ లేదా శర్వానంద్ నటించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెప్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here