Ruturaj Gaikwad: పూజా హెగ్దేని ‘లైక్’ చేసిన ఐపీఎల్ స్టార్: పాపం ట్రోలింగ్ బారిన పడ్డాడిలా.!

NQ Staff - April 13, 2022 / 12:01 PM IST

Ruturaj Gaikwad: పూజా హెగ్దేని ‘లైక్’ చేసిన ఐపీఎల్ స్టార్: పాపం ట్రోలింగ్ బారిన పడ్డాడిలా.!

Ruturaj Gaikwad: క్రికెటర్లకీ, సినీ తారలకీ మధ్య విడదీయరాని సంబంధం వుందని గతంలో పలు సందర్భాల్లో నిరూపితమయ్యింది. క్రికెటర్లకు హీరోయిన్లు అభిమానులుగా మారడమో.. లేదంటే, స్టార్ హీరోయిన్లను క్రికెటర్లు ఆరాధించడమో ఎప్పటినుంచో జరుగుతూనే వుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చాక.. ఈ సినిమాటిక్ క్రికెట్ ప్రేమలు మరింత ఎక్కువయ్యాయ్.

Ruturaj Gaikwad Trolled for Liking Pooja Hegde's Post

Ruturaj Gaikwad Trolled for Liking Pooja Hegde’s Post


ఫలానా క్రికెటర్‌తో ఫలానా హీరోయిన్ రాసుకు పూసుకు తిరుగుతోందన్న గాసిప్స్ మాత్రమే కాదు, నిజంగా అలా తిరుగుతున్న జంటలూ వున్నాయ్. ఈ క్రమంలో పలువురు క్రికెటర్లు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆయా హీరోయిన్ల వలలో పడి, క్రికెటర్లు తమ ఫామ్ కోల్పోయి, కెరీర్ నాశనం చేసుకున్న సందర్బాలూ లేకపోలేదు.

అసలు విషయానికొస్తే, బుట్టబొమ్మ పూజా హెగ్దే ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది. వాటిని లైక్ చేశాడో క్రికెటర్. అతనెవరో కాదు రుతురాజ్ గైక్వాడ్. అంతే, రుతురాజ్ మీద ట్రోలింగ్ షురూ అయ్యింది. గత కొన్ని మ్యాచ్‌లనుండీ మనోడి ఆటతీరు అత్యంత అధ్వాన్నంగా తయారైంది. స్వల్ప స్కోర్లకే వెనుదిరుగుతున్నాడు.

ఆ స్కోర్లను పేర్కొంటూ, హీరోయిన్ల మీద ఫోకస్ తగ్గించి.. ప్రత్యర్థి విసిరే బంతుల మీద ఫోకస్ పెట్టు.. అంటూ ఒకింత వల్గర్‌గానే ట్రోల్ చేస్తున్నారు రుతురాజ్ గైక్వాడ్‌ని. అందాన్ని ఆరాధించడం తప్పు కాదంటూ మరికొందరు అతన్ని సమర్థిస్తున్నారు.

Read Today's Latest గుసగుసలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us