భర్తకు విడాకులు ఇచ్చింది. కొడుకును పెళ్లి చేసుకుంది

Advertisement

రష్యాకు చెందిన మరీనా బాల్మషేవా అనే ముప్పై ఐదు సంవత్సరాల వయస్సు గల సోషల్ మీడియా స్టార్ తన ఇరువై యేండ్ల కొడుకును పెళ్లాడింది. ఇదంతా వినడానికి ఒక వింత గా ఉన్న ఇది మాత్రం నిజం. అయితే మరీనా పెళ్లి చేసుకుంది తన కన్నా కొడుకును కాదండోయ్.. తాను ఇరువై ఏళ్లుగా దత్తతు తీసుకొని పెంచుకుంటున్న ఇరువై సంవత్సరాల వయస్సు గల వ్లాడిమీర్ అనే కుర్రాడిని మరీనా పెళ్లి చేసుకుంది.

ఇక వివరాల్లోకి వెళితే రష్యా లోని రాస్ నోడార్ రాయ్ అనే ప్రాంతానికి చెందిన మరీనా అదే ప్రాంతానికి చెందిన నలబై ఐదు సంత్సరాల అలెక్సీ అనే వ్యక్తిని 2007 సంవత్సరంలో పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి తరువాత భార్యాభర్తలు ఇద్దరు కూడా ఐదుగురు పిల్లలను దత్తతు తీసుకున్నారు.

ఇక 2017 సంవత్సరంలో మరీనా తన భర్త అలెక్సీ కి విడాకులు ఇచ్చింది. అలా ఇద్దరు విడిపోయే ముందు ఐదుగురు పిల్లల్లో ఒకరిని అలెక్సీ పెంచుకుంటున్నాడు. ఇక మిగితా నలుగురిని కూడా మరీనా పోషిస్తుంది. ఇక మరీనా దగ్గర ఉన్న నలుగురు పిల్లల్లో ఒకరు అయినా వ్లాడిమిర్ తో మరీనా ప్రేమలో పడింది. ఇక వీళ్లిద్దరి వయస్సు పదిహేను సంవత్సరాల తేడా ఉన్నప్పటికీ ఇద్దరు కూడా గాఢంగా ప్రేమించుకున్నారు.

ఇక మేము ఇద్దరం మే నెలలో పెళ్లి చేసుకోబోతున్నట్లు మరీనా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా షేర్ చేసింది. ఇక మరీనా పోస్ట్ చేసిన ఫొటోలో ఒకటి పదమూడు ఏళ్ళ క్రితం వ్లాడిమిర్ తో దిగిన ఒక ఫోటో ను, అలాగే ప్రస్తుతం దిగిన ఒక ఫోటోను కలిపి ఆమె పోస్ట్ చేసింది. ఇక రెండు నెలల తరువాత వాళ్ళు లోకల్ రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకొని ఇద్దరు కూడా ఒకటి అయ్యారు. అంతేకాదు త్వరలో వీళ్లిద్దరు ఓ బాబుకు కూడా జన్మను ఇవ్వబోతున్నారు అని తెలిపింది.

ఇక వీళ్లిద్దరి జంటను చూసి కొందరు ఆనందిస్తుండగా.. మరికొంతమంది తమ పెళ్లిని వ్యతిరేకిస్తున్నారని మరీనా చెప్పుకొచ్చింది. ఇక ఎవరు ఏం అనుకున్న తాము ఇద్దరు కూడా సంతోషంగా ఉన్నామని ఆమె తెలిపింది. ఇక తమ పెళ్ళికి తన మాజీ భర్త అలెక్సీ కూడా వ్యతిరేకించవచ్చని ఆమె చెబుతోంది.ఇక జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు అని మరీనా అంటుంది.ఇక ఉదాహరణకు మేమె దానికి సాక్షం అని చెబుతుంది మరీనా.

ఇక ఇది చుసిన నెటిజన్లు మరీనా పై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. తన కొడుకుల పెంచుకున్న వ్యక్తితో పెళ్లి చేసుకోవడం మంచి పద్దతి కాదని తెగ మండిపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here