రష్యా వ్యాక్సిన్‌: ఇండియాకు 10కోట్ల డోసులు

Advertisement

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. ఇక ఈ మహమ్మారిని నివారించేందుకు ప్రపంచ దేశాలలోని శాస్త్రవేత్తలు అహర్నిశలు కస్టపడుతున్నారు. ఇక ఈ తరుణంలో రష్యా వ్యాక్సిన్ ను కూడా విడుదల చేసింది. ఇక ఆ వ్యాక్సిన్ పై పలు విమర్శలు వచ్చాయి. అయితే ఈ రష్యా వ్యాక్సిన్ విషయంలో ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ కీలక వ్యాఖ్యలు చేసింది. రష్యా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్ వి’తో శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు.

ఇక ఈ రష్యా వ్యాక్సిన్ భారత ఫార్మా దిగ్గజం అయిన ‘డాక్టర్ రెడ్డీస్’ చేతికి వచ్చింది. ‘స్పుత్నిక్ వి’ వ్యాక్సిన్ పై మన దేశంలో మూడవదశ క్లినికల్ పరీక్షలు నిర్వహించేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ తో ఒప్పందం చేసుకున్నట్లు రష్యా సావరిన్‌ వెల్త్‌ ఫండ్‌ ఆర్‌డీఐఎఫ్ తాజాగా వెల్లడించింది. ఇక దీని ద్వారా దేశీయంగా డాక్టర్ రెడ్డీస్ మూడవదశ క్లినికల్ పరీక్షలను చేపట్టనున్నట్లు పేర్కొంది. ఇక పది కోట్ల డోసులకోసం ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఇక ఈ ట్రయల్స్ విజయవంతం అయితే నవంబర్ లోనే ప్రజలకు అందుబాటులోకి వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here