భారత్‌ చేతిలో రష్యా వ్యాక్సిన్‌ డేటా..!

Admin - September 7, 2020 / 12:16 PM IST

భారత్‌ చేతిలో రష్యా వ్యాక్సిన్‌ డేటా..!

కరోనా ప్రపంచవ్యాప్తంగా భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఇక ఇప్పటికే ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలు అన్ని కూడా వ్యాక్సిన్ కోసం అహర్నిశలు కష్టపడుతున్నాయి. ఇది ఇలా ఉంటె ఇప్పటికే రష్యా ఓ వ్యాక్సిన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే రష్యాలోని గమలేయా పరిశోధన సంస్థ ఆవిష్కరించిన కరోనా వ్యాక్సిన్‌ ‘స్పుత్నిక్‌-వి’పై ఆశలు వెలువడుతున్నాయి. ఈ వ్యాక్సిన్ తొలి రెండు దశల్లో 76మందిపై ప్రయోగాలు జరిపారు.

ఇక ఈ మానవ ప్రయోగాల్లో మెరుగైన ఫలితాలు వస్తున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ తరుణంలోనే రష్యా ఇప్పటివరకు జరిపిన తొలి రెండు దశల ప్రయోగాల సమగ్ర సమాచారాన్ని భారత్ పరిశోధకులకు అందించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వ్యాక్సిన్‌ భద్రత, సమర్థతకు సంబంధించి రష్యా పరిశోధకుల నుంచి భారత్‌ నిపుణులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us